పాపులారిటీ గల రాజకీయ నేత మోదీ: ప్యూ రీసర్చ్
ప్రధాన మంత్రి మోదీకి తిరుగులేదని 'ప్యూ రీసర్చ్' నిర్వహించిన తాజా సర్వేలో పేర్కొనింది. భారత రాజకీయాల్లో ప్రధాని మోదీ పాపులారిటీ గల రాజకీయ నేతగా అభివర్ణించింది. పాపులారిటీ ర్యాంకులు ఇవ్వాలని కోరుతూ.. ప్యూ రీసర్చ్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న 2464 మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. మోదీని 88% మంది సమర్ధించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 58%, అలాగే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని 57%, ఢిల్లీ సీఎం క్రేజీవాల్ ను 39% మంది సమర్ధించారు. సర్వే ను ఫిబ్రవరి 21 నుంచి మర్చి10 వరకు నిర్వహించారు. భారత ఆర్థిక వ్యవస్థ బాగుందని ప్రతి పది మందిలో ఎనిమిది మంది అంగీకరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మోదీ హవా కొనసాగింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి సర్వేలో పాల్గొన ప్రతి 10 మందిలో 9 మంది మోదీ పట్ల సానుకూల ధోరణితో ఉన్నారని తెలిపింది.