PM Modi Security Breach: ప్రధాని మోదీ పంజాబ్ టూర్ ఘటనలో 150 మందిపై కేసులు..
PM Modi security breach FIR Registered Against 150 People : ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన భద్రతా వైఫల్యం విషయంలో 150 మందిపై కేసులు నమోదు. భద్రతా వైఫల్యం వ్యవహారంపై కేంద్రానికి నివేదిక పంపించిన పంజాబ్ సర్కార్.
PM Modi security breach updates FIR Registered Against 150 Unidentified People In Ferozepur : ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన భద్రతా వైఫల్యం సంఘటన (Prime Minister Narendra Modi's security breach incident) కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా దుమారాన్నే రేపుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ ఘటనలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ పోలీసులు 150 మందిపై ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు.
రోడ్డుపై రాకపోకలకు అంతరాయం కలిగించడం వల్ల ఫిరోజ్‌పుర్ జిల్లాలోని (Ferozepur district) కుల్గరి పోలీస్‌స్టేషన్‌లో (Kulgari police station) ఈ కేసులు నమోదు అయ్యాయి. కేసులు నమోదైన వ్యక్తులకు జరిమానా విధించే సెక్షన్‌తో ఎఫ్‌ఐఆర్‌లు (FIR Registered) ఫైల్ అయ్యాయి. ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పంజాబ్ సర్కార్.. కేంద్రానికి నివేదిక పంపించింది.
అయితే ప్రధాని మోదీ గత బుధవారం పంజాబ్ (Punjab) పర్యటనకు వెళ్లగా.. అక్కడ ఫిరోజ్‌పుర్ జిల్లాలో (Ferozepur district) ఆందోళనకారులు రాస్తారోకో చేపట్టారు. రహదారులను దిగ్బంధించి నిరసన చేపట్టారు. దీంతో మోదీ కాన్వాయ్ (Modi convoy) దాదాపు 20 నిమిషాల పాటు వంతెనపై చిక్కుకుపోవాల్సి వచ్చింది.
Also Read : Sathyaraj Hospitalised: కరోనాతో ఆసుపత్రిలో బాహుబలి కట్టప్ప.. సీరియస్ కండిషన్..
దీంతో తన పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకుని తిరిగి ఎయిర్‌పోర్ట్ (Airport) వెళ్లి ఢిల్లీ చేరుకున్నారు ప్రధాని. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే మోదీ (Modi) సభకు హాజరు కాలేకపోయారంటూ కేంద్ర హోంశాఖ ప్రకటించడంతో ఈ వ్యవహారంపూ దుమారం రేగింది.
Also Read : Nidhi Aggarwal: మొన్న నయనతార, త్రిష..ఇప్పుడు నిధి అగర్వాల్..త్వరలో పెళ్లి కూడా అట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook