lockdown in India 2022: ముఖ్యమంత్రులతో రేపు ప్రధాని మోదీ భేటీ- మరోసారి లాక్డౌన్?
lockdown in india 2022: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న ప్రధాని, ముఖ్యమంత్రుల భేటీకి ప్రధాన్యత సంతరించుకుంది.
lockdown in india 2022: దేశవ్యాప్తంగా కొవిడ్ తీవ్ర రూపం దాల్చుతోంది. కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. స్పష్టంగా చెప్పాలంటే.. గత నెల 10 వేల దిగువకు పడిపోయిన కొవిడ్ కేసులు.. ఇటీవలి కాలంలో లక్షల్లో (Corona cases in India) నమోదవుతున్నాయి. కేవలం 10-15 రోజుల్లోనే ఈ స్థాయి వృద్ధి చూస్తే దేశంలో కొవిడ్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఓ వైపు కరోనా విజృంభిస్తుండగా దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ భయాలు ఆందోళన (Corona Third Wave) కలిగిస్తున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే కరోనా థార్డ్వేవ్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించాయి.
కొవిడ్ పరిస్థితులు రోజు రోజుకు ఆందోళనకరంగా మరుతునన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. వర్చువల్‌గా ఈ భేటీ (PM Modi to hold Meet With CMs) జరగనుంది.
ఇటీవల ముఖ్యమంత్రుల భేటీలో.. థార్డ్ వేవ్ భయాల నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిబంధనలు కట్టుదిట్టం చేయాలని కూడా సలహా ఇచ్చారు. అయినా కేసులు మాత్రం పెరుగుతూ పోతూ (India Covid Update) ఉన్నాయి. పండుగ సీజన్ కావడంతో మరిన్ని కేసలు నమోదయ్యే అవకాశముంది.
ఇలాంటి పరిస్థితుల కారణంగా గురువారం జరిగే ప్రధాని, ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ముఖ్యమంత్రులతో చర్చించి మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించొచ్చని (Lock down in India soon) అంచనాలు వస్తున్నాయి. అయితే మళ్లీ లాక్డౌన్ అంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అంటున్నారు విశ్లేషకులు. ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని (Experts on Lock down in India) చెబుతున్నారు.
మరి ప్రధాని, ముఖ్యమంత్రుల భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది.
Also read: Delhi New Rules: ఢిల్లీలో ఇక నుంచి ప్రైవేటు ఆఫీసులకు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి
Also read: India Corona Cases Today: దేశంలో రెండు లక్షలకు చేరువైన కరోనా కేసులు- 442 మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook