PM Modi To Host Dinner Party: న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ విందు పార్టీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఎగ్జిబిషన్ జరిగే ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ స్థలం ఈ డిన్నర్ పార్టీకి వేదిక కానుంది. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరిగిన G20 సదస్సుకు కట్టుదిట్టమైన భద్రతను అందించడంలో ఢిల్లీ పోలీసులు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపే చర్యల్లో భాగంగా వారికి ఒక విందు ఏర్పాటు చేయాలి అని ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిర్ణయం తీసుకోవడమే కాకుండా సెప్టెంబర్ 16న జరగనున్న డిన్నర్ పార్టీకి ఢిల్లీ పోలీసు శాఖలో ఆహ్వానితుల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాను కోరారు. ఢిల్లీ పరిధిలోని అన్ని జిల్లాల పోలీసు అధికారుల పేర్లను అందించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కేంద్రం ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాకు ఓ లేఖ రాసింది.


20 దేశాల నుండి 30 మందికి పైగా ప్రపంచ నాయకులు హాజరైన రెండు రోజుల G20 సదస్సు శిఖరాగ్ర సమావేశాల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా డాగ్ స్క్వాడ్‌ నుండి మౌంటెడ్ పోలీసుల వరకు 50,000 మంది పోలీసు సిబ్బంది సేవలు అందించారు. G20 సదస్సుకు భద్రతను అందించడంలో అత్యుత్తమ పని తీరు కనబరిచిన పోలీసు అధికారుల జాబితాను సిద్దం చేసి పంపించాల్సిందిగా ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా ఢిల్లీలోని అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.


ఇది కూడా చదవండి : RBI Jobs: రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగాలు.. డిగ్రీ చదివితే చాలు జాబ్ మీకే!


G20 సదస్సుకు భద్రత కల్పించడంలో అసాధారణ ప్రతిభ కనబర్చిన పోలీసులకు, వారి సేవను గుర్తిస్తూ ఢిల్లీ పోలీసులకు మంగళవారమే ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ప్రత్యేక ప్రశంసా పత్రాలు, సర్టిఫికేట్స్ ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వారికి డిన్నర్ పార్టీ ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిర్ణయం తీసుకోవడం వారికి మరింత బూస్టింగ్‌ని ఇవ్వనుంది. అమెరికా, రష్యా, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాల అధినేతలు పాల్గొన్న నేపథ్యంలో ఢిల్లీలో G20 సదస్సుకు భద్రత కల్పించడం నిజంగానే ఢిల్లీ పోలీసులకు ఇది కత్తి మీద సాములా తయారైంది. వివిధ దేశాల అధినేతలు ఢిల్లీలో అడుగుపెట్టింది మొదలు వారు ఢిల్లీ నుండి తిరిగి సురక్షితంగా వెళ్లే వరకు ఎక్కడ ఏం జరుగుతుందా అనే టెన్షన్ ఢిల్లీ పోలీసులను ఒక్క చోట నిలబడకుండా విధుల్లో నిమగ్నమయ్యేలా చేసింది. ఈ కారణంగానే ప్రధాని మోదీ సైతం వారి సేవలను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఇది కూడా చదవండి : 7th Pay Commission: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. నిబంధనల్లో మార్పు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి