Modi Twitter Account Hacked: ప్రముఖుల ట్విట్టర్ ఎక్కౌంట్లు హ్యాక్ అవుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కౌంట్ హ్యాక్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఎక్కౌంట్ హ్యాక్ కావడం సంచలనంగా సృష్టించింది. గత కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల ట్విట్టర్ ఎక్కౌంట్లపై హ్యాకర్లు కన్నేశారు. ఇందులో భాగంగా ఇటీవలికాలంలో చాలామంది ఎక్కౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఇండియాపై దృష్టి పెట్టారు. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi)ట్విట్టర్ ఎక్కౌంట్ హ్యాక్ చేయడమే కాకుండా అనుమానాస్పద ట్వీట్ చేశారు. 


[[{"fid":"217280","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Pm modi twitter account been hacked","field_file_image_title_text[und][0][value]":"ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఎక్కౌంట్ హ్యాక్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Pm modi twitter account been hacked","field_file_image_title_text[und][0][value]":"ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఎక్కౌంట్ హ్యాక్"}},"link_text":false,"attributes":{"alt":"Pm modi twitter account been hacked","title":"ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఎక్కౌంట్ హ్యాక్","class":"media-element file-default","data-delta":"1"}}]]


దేశంలో బిట్ కాయిన్లను(BItcoins Legalised)లీగలైజ్ చేశామని ప్రధాని ట్వీట్ చేసినట్టుగా హ్యాకర్లు ట్వీట్ చేసారు. అంతేకాకుండా దేశ ప్రజలందరికీ 5 వందల బిట్ కాయిన్లను పంచుతున్నామని ట్వీట్టర్‌లో తెలిపారు. ఈ ట్వీట్‌తో అప్రమత్తమైన పీఎంఓ కార్యాలయం జాగ్రత్తలు తీసుకుంది. ఎక్కౌంట్ హ్యాక్(Modi Account Hacked) అయినట్టు అధికారికంగా ప్రకటించింది. నిన్న ఉదయం 2 గంటల ప్రాంతంలో ఎక్కౌంట్ హ్యాక్ అయితే..3 గంటలకు పీఎంఓ కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. హ్యాక్ అయిన విషయాన్ని ట్విట్టర్‌కు సమాచారం అందించినట్టు పీఎంవో(PMO)కార్యాలయం తెలిపింది. దాంతో ట్విట్టర్ వెంటనే ప్రధాని ఎక్కౌంట్ కు అదనపు భద్రత కల్పించింది. మోదీ ట్విట్టర్ ఎక్కౌంట్(Modi Twitter Account)హ్యాక్ కావడం ఇది రెండవసారి. గతంలో క్రిప్టోకరెన్సీ రూపంలో మోదీ సహాయనిధికి విరాళాలు ఇవ్వాల్సిందిగా ట్వీట్ చేశారు.



Also read: Gas Leak in Erode: రసాయన పరిశ్రమలో లీకైన విషవాయువు...ఒకరు మృతి, 13 మంది పరిస్థితి విషమం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook