Narendra Modi Twitter Followers: ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న నాయకుల్లో నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలుస్తారు. ఇప్పుడు కోట్లాది మంది అభిమానం పొందుతున్న నాయకుడిగా ప్రపంచ నాయకుల్లో మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారు. 'ఎక్స్‌' అలియాస్‌ ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నాయకుడిగా మోదీ రికార్డు సాధించారు. వంద మిలియన్ల ఫాలోవర్ల మైలురాయిని దాటేశారు. ఈ సందర్భంగా మోదీ హర్షం వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Nitish Kumar Touch Feet: అవసరమైతే మీ కాళ్లు మొక్కుతా? ముఖ్యమంత్రి వింత ప్రవర్తన


సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోదీ చాలా చురుగ్గా ఉంటారు. నరేంద్ర మోదీ అనే పేరు సోషల్‌ మీడియా ఖాతాలు ఉన్నాయి. ఇంకా నమో వంటి యాప్‌లు కూడా ఉన్నాయి. వీటిలో ఏ నాయకుడికి సాధ్యం కాని రీతిలో మోదీ రికార్డులు నెలకొల్పుతున్నారు. తాజాగా ఎక్స్‌లో మైలురాయిని దాటేశారు. ఆయన ట్విటర్‌ ఫాలోవర్ల సంఖ్య ఆదివారం 100 మిలియన్లు దాటింది. అంటే పది కోట్ల మంది నరేంద్ర మోదీ అనే ట్విటర్‌ ఖాతను ఫాలో అవుతున్నారు. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీకి సామాజిక మాధ్యమాల్లో ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. దేశంలోనే కాదు విదేశాల్లోనూ మోదీకి అండగా నిలుస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాగా నరేంద్ర మోదీ పేరిట యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా కూడా ఉంది. యూట్యూబ్‌లో 26.9 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాలో 91.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Also Read: Union Budget 2024: సామాన్యులకు మోడీ బంపరాఫర్.. ఒక్కో కుటుంబానికీ నేరుగా రూ. 10 లక్షలు..


గుజరాత్‌ ముఖ్యమంత్రిగా 2009లో నరేంద్ర మోదీ ట్విటర్‌ను వాడడం మొదలుపెట్టారు. ఏడాది కాలానికే లక్ష ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుని ఔరా అనిపించారు. ఆ తర్వాత ఏడాది 4 లక్షలకు పెరిగారు. 2020 జూలై నాటికి 6 మంది ఫాలోవర్లను మోదీ సొంతం చేసుకున్నారు. అనంతరం 2020 నుంచి 2024 ఈ నాలుగేళ్లలో 4 కోట్ల మంది ఫాలోవర్లను పెంచుకోవడం విశేషం. తాజాగా వంది మిలియన్ల మార్క్‌ను మోదీని సొంతం చేసుకోవడం గమనార్హం. కాగా ప్రపంచంలో ఏ నాయకుడికి ఇంత ఆదరణ లేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 38 మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఇక దేశంలో మోదీ తర్వాత అత్యంత ఆదరణ కలిగిన నాయకుడు ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. ఎక్స్‌లో 27.5 మిలియన్ల ఫాలోవర్లు కేజ్రీవాల్‌కు ఉన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 26.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి