భారత ప్రధాని నరేంద్రమోదీకి ప్రతిష్టాత్మక `సియోల్ శాంతి బహుమతి`

భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రతిష్టాత్మక సియోల్ శాంతి బహుమతి వరించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రతిష్టాత్మక సియోల్ శాంతి బహుమతి వరించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచాన్ని ఆయన "మోదీనామిక్స్" ద్వారా ప్రభావితం చేస్తూ దేశ ఆర్థిక పురోగతికి దోహదపడే నిర్ణయాలు తీసుకున్నందున ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ తెలిపింది. గతంలో ఇదే అవార్డును ఐక్యరాజసమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్‌తో పాటు అదే పదవిని అధిరోహించిన మరో వ్యక్తి బాన్ కీ మూన్ కూడా పొందడం జరిగింది. ప్రతీ రెండు సంవత్సరాలకు అందించే ఈ అవార్డును 2018 సంవత్సరానికి గాను నరేంద్ర మోదీకి అందించడం జరిగింది.
తాజాగా మోదీకి ఈ అవార్డును ప్రకటిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలను మెరుగు పరచుకోవడంతో పాటు... దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం, సామాజిక అభ్యుదయానికి పెద్దపీట వేసే నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ తిరుగులేని పాత్రను పోషించారని తెలియజేయడం జరిగింది. ఈ మేరకు కమిటీ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్‌లో మోదీ తీసుకున్న అతి గొప్ప నిర్ణయం డీమానిటైజేషన్ (నోట్ల రద్దు) అని.. అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఎంతో సాహసోపేతంతో కూడుకున్నదని కమిటీ తెలిపింది.
దేశ, అంతర్జాతీయ శాంతి ఒప్పందాలపై మోదీ వైఖరి, ఆయన అవలింబిస్తున్న పద్ధతులు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకొనే ఈ అవార్డును మోదీకి అందివ్వడానికి కమిటీ ముందుకొచ్చిందని కూడా ఆ ప్రెస్ రిలీజ్‌లో తెలియజేయడం జరిగింది. ఈ అవార్డు ప్రారంభమయ్యాక.. దానిని తీసుకుంటున్న 14వ వ్యక్తి మోదీ కావడం విశేషం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 1300 నామినేటర్లు ఈ అవార్డు కోసం 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా.. వారిలో అతి ఎక్కువ ఓట్లు మోదీకి దక్కడంతో ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగిందని కమిటీ తెలియజేసింది.