కొండగట్టు బస్సు ప్రమాదం దుర్ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ
కొండగట్టు బస్సు ప్రమాదం దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని నరేంద్ర మోదీ
జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై జరిగిన బస్సు ప్రమాదం దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో భారీ సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఈమేరకు మంగళవారం సాయంత్రం ఓ ట్వీట్ చేసిన మోదీ.. మృతుల కుటుంబీకులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 52కు చేరింది. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఘటనాస్థలంలో మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కొండగట్టు ఘాట్ రోడ్డుపై జరిగిన ఈ దుర్ఘటన ఎన్నో వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.