Modi Jokes: పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిపై దృష్టి సారించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సమయంలో ఒక చోట మహిళలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారితో సరదా సంభాషణ చేశారు. లబ్ధిదారులైన మహిళలు మోదీ మాటలు విని నవ్వుకున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Mallu Ravi: తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం.. సంచలనం సృష్టించిన మల్లు రవి రాజీనామా


వారణాసిలో ఏర్పాటుచేసిన అమూల్‌ బనస్‌ డైరీ ప్లాంట్‌ను శుక్రవారం మోదీ ప్రారంభించి ఈ సందర్భంగా మహిళలతో సమావేశమయ్యారు. రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ పథకంతో దేశవ్యాప్తంగా మహిళలకు ఆవులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గిర్‌ ఆవుల పెంపకంతో తమకు కలిగిన ప్రయోజనాలను మహిళలు మోదీతో పంచుకున్నారు. పాల ద్వారా మహిళలు ఆర్థిక వృద్ధి సాధించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పాల విక్రయంతో వచ్చిన ఆదాయాన్ని మహిళల ఖాతాలోనే జమ చేయాలనేది తమ భావన అని చెప్పారు. 'ఇప్పుడు మీకు ఆదాయం వస్తుందో కదా ఇంట్లో మీరు పెత్తనం చేస్తున్నారా?' అని మోదీ ప్రశ్నించారు. దీనివల్ల ఏదైగా గొడవ జరిగితే మాత్రం దానికి మోదీనే కారణం అని చెప్పకూడదని సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని తన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్‌ స్కామ్‌లో కవిత అరెస్ట్‌ తప్పదా?


'మహిళా సాధికారతకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. గిర్‌ ఆవుల పంపిణీతో వారణాసి మహిళల జీవితాలు మారాయని తెలిసి ఎంతో ఆనందంగా ఉంది' అని ట్వీట్‌ చేశారు. పశువుల పోషణతో ఆర్థికంగా పొందుతున్న ప్రయోజనలను మోదీ అడుగుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోలో మోదీ చాలా ఉత్సాహంగా కనిపించారు. మరోసారి వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీ చేసే యోచనలో ఉన్నారు. మళ్లీ పోటీచేసి తిరుగులేని మెజార్టీ సాధించాలని బీజేపీ భావిస్తోంది.

అంతకుముందు జరిగిన బహిరంగ సభల్లో జాతీయ రాజకీయాలపై మోదీ స్పందించారు. 'ఎన్నికల సమయంలో ప్రతిసారి విపక్ష నాయకులు కలిసివస్తున్నారు. కానీ దానివల్ల ఫలితం శూన్యమే. వారి ఒకరినొకరు నిందించుకోవడమే సరిపోతుంది. ఈసారి బీజేపీ భారీ విజయాన్ని సాధిస్తుంది. అన్ని సీట్లు ఎన్డీయేకే దక్కుతాయి' అని విశ్వాసం వ్యక్తం చేశారు. బనారస్‌ విశ్వవిద్యాలయాన్ని మోదీ సందర్శించారు. అక్కడ పలు పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసిన అనంతరం విద్యార్థులతో మాట్లాడారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి