ISRO Second Space Station: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు ఇప్పటి వరకూ దేశంలో ఒకే ఒక్క కేంద్రం ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇప్పుడు రెండవ ఇస్రో కేంద్రం నిర్మించనున్నారు. ఈ రెండవ అంతరిక్ష ప్రయోగ కేంద్రం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా కులశేఖరపట్నంలో ఇస్రో రెండవ అంతరిక్ష కేంద్రం నిర్మించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మరో 17.300 కోట్ల విలువనై అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. కులశేఖరపట్నంలో రెండవ ఇస్రో కేంద్రం ప్రారంభంతో తమిళనాడు రనున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చాక రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు. 


మొత్తం 986 కోట్ల ఖర్చుతో ఇస్రో రెండవ అంతరిక్ష కేంద్రం నిర్మించనున్నారు. భూమధ్యరేఖకు అత్యంత సమీపంలో ఉన్నందున ఉపగ్రహాల్ని ఉంచేందుకు అనువుగా ఉంటుందని అంచనా. మొత్తం 2,350 ఎకరాలు అవసరం కాగా 2022 జూలై నాటికే 1950 ఎకరాల సేకరణ పూర్తయింది. తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం 961 హెక్టార్ల భూమి కేటాయించింది. ఇప్పటివరకూ శ్రీహరికోట ఒకటే స్పేస్ సెంటర్ కావడంతో అన్ని ప్రయోగాలు ఇక్కడ్నించే జరుగుతున్నాయి. ఇప్పటివరకూ 95 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టగా అందులో 80 సక్సెస్ అయ్యాయి.


ఇస్రో రెండవ స్పేస్ స్టేషన్ నిర్మాణం రెండేళ్లలో పూర్తి కానుందని అంచనా వేస్తున్నారు. తూత్తుకూడి జిల్లాలోని కులశేఖరపట్నం, శతనాకులం తాలూకా పరిధిలోని పడుక్కపాతు, పల్లాకురిచి, మాతవకురిచిలోని 2,233 ఎకరాల్లో ఈ స్టేషన్ నిర్మితం కానుంది. మరోవైపు ఇదే జిల్లాలో ఇంకో 2 వేల ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పేస్ ఇండస్ట్రియల్ అండ్ ప్రోపెల్లెంట్ పార్క్ ఏర్పాటు చేయనుంది. కులశేఖరపట్నం స్పేస్ స్టేషన్ ద్వారా ఉపగ్రహాల్ని దక్షిణంవైపుకు ప్రయోగించవచ్చని ఇస్రో తెలిపింది. అదే శ్రీహరికోట నుంచి అయితే సౌత్ ఈస్ట్ నుంచి శ్రీలంక మీదుగా ప్రయోగించాల్సి వస్తోంది. 


Also read: CAA Rules: మరో వారం రోజుల్లో సీఏఏ అమలు, నిబంధనల నోటిఫైకు కేంద్రం సన్నాహాలు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook