ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు అనంతరం దేశం నలుమూలలా బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని అన్నారు. ప్రతీ ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ని ప్రవేశపెట్టినట్టు ప్రధాని తెలిపారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముందు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్లను విడిచిపెట్టడం లేదు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాకా రుణాలు తీసుకున్న వాళ్లు ఎవ్వరూ ఆ రుణాలు ఎగ్గొట్టలేదు అని ఈ సందర్భంగా మోదీ స్పష్టంచేశారు.