ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. కీలకమైన నిర్ణయాల్ని తీసుకున్నారు. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీ వివిధ అంశాల రీత్యా ప్రాధాన్యత సంతరించుకుంది. తొమ్మిదేళ్ల మోదీ పరిపాలన, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపైనే మంత్రిమండలి సమావేశం ముగిసింది. మరోవైపు ఈ ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలపై కీలకంగా చర్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019లో రెండవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక మంత్రిమండలిని ఒకసారి మాత్రమే విస్తరించారు. ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు రోజురజుకూ పెరుగుతున్నాయి. తొమ్మిదేండ్ల పాలనలో ప్రభుత్వం చేసిన ఎన్నో అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడం, వచ్చే 9 నెలల్లో వాటిని అమలు చేయడం వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులకు సూచనలు జారీ చేశారు. 2047 వరకూ ఇండియా ఎలా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయనే అంశంపై దర్యాప్తు జరిగింది.రానున్న కొద్దికాలం చాలా జాగ్రత్తగా వ్యవరించాలని మోదీ తెలిపారు.ఇప్పటివరకూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రతి అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల  సమావేశాలకు ప్రభుత్వం సిద్ధం చేయాల్సిన ఎజెండాపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. మరీ ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రతిపాదించనున్న యూసీసీపై చర్చించారు. 


Also read; Pension Scheme For Unmarried: పెళ్లికాని వారికి గుడ్‌న్యూస.. పెన్షన్ పథకం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook