తిరువనంతపురం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం లక్షద్వీప్ లో సమీక్షా సమావేశం జరిగింది. ఇటీవల సంభవించిన 'ఓఖీ' పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. 'ఓఖీ' దెబ్బకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల తీరప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిన విషయం తెలిసిందే..! మంగళవారం ప్రధాని నేరుగా మంగళూరు నుండి ఓఖీ బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమీక్షా సమావేశంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అధికారులు, పునరావాసం, రెస్క్యూ పనుల్లో నిమగ్నమైన వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం ఆంతరం ప్రధాని మోదీ ఓఖీ బాధితులతో లక్షద్వీప్ లోని కావరట్టిలో మాట్లాడారు. అంతకు ముందు ఆయన లక్షద్వీప్ చేరుకున్నాక పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు.


ప్రధాని నరేంద్ర మోదీ తిరువనంతపురం చేరుకున్నాక, ఆయన్ను కేరళ సీఎం పినారయి విజయన్ స్వాగతం పలికారు. కన్యాకుమారిలో తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి స్వగతం పలికారు. నిన్న సోమవారం ప్రధాని మోదీ మంగళూరుకు చేరుకున్నారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం లక్షద్వీప్ కు ఆర్మీ హెలికాప్టర్ లో బయలుదేరారు. 'ఓఖీ' తుఫానుచే ప్రభావితమైన ప్రాంతాలను సందర్శించారు.