మెట్రో ప్రయాణికులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ మెట్రో రైలులో ప్రత్యక్షమైన ప్రధాని నరేంద్ర మోదీతో ప్రయాణికుల సెల్ఫీలు
ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణికులకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఢిల్లీలోని దౌలాకాన్ నుంచి ద్వారకా వెళ్లేందుకు ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రో రైలు ఎక్కి కూర్చున్నారు. మెట్రో రైలు ప్రయాణంలో అనుకోని అతిధిని చూసి షాకవడం మెట్రో ప్రయాణికుల వంతయ్యింది. ద్వారకాలో ఇంటర్నెషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసీసీ) శంకుస్థాపన కోసం వెళ్లే క్రమంలో మార్గం మధ్యలో ప్రధాని మోదీ మెట్రో రైలులో ప్రయాణించారు. హఠాత్తుగా మెట్రో రైలులో ప్రత్యక్షమైన ప్రధాని నరేంద్ర మోదీతో ప్రయాణికులు సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ కనిపించారు. ప్రధాని మోదీ సైతం వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా పలకరించారు.