PM Security Breach: పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యంపై సుప్రీం కోర్టులో (Supreme Court) శుక్రవారం (జనవరి 7) విచారణ జరిగింది. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనకు సంబంధించిన ట్రావెల్ రికార్డులను భద్రపరచాలని పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు పంజాబ్ పోలీసులు, ఎస్పీజీ ప్రొటెక్షన్ గ్రూప్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు రిజిస్ట్రార్‌కు సహకరించాలని కోరింది. భద్రతా వైఫల్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన రెండు వేర్వేరు కమిటీల విచారణను సోమవారం (జనవరి 10) వరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని పంజాబ్ పర్యటనలో (PM Punjab Visit) భద్రతా వైఫల్యంపై న్యాయవాది మణిందర్ సింగ్ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిల్‌పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేత్రుత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయవాది మణిందర్ సింగ్ వాదిస్తూ... భద్రతా వైఫల్యంపై ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ అవసరమని పేర్కొన్నారు. పంజాబ్ ప్రభుత్వం నియమించిన కమిటీతో విచారణపై అభ్యంతరం వ్యక్తం చేశారు.


 అంతేకాదు, ఈ కమిటీకి నేత్రుత్వం వహిస్తున్న జస్టిస్ మెహ్తాబ్ సింగ్ గతంలో ఒక స్కామ్‌లో భాగస్వామి అని ఆరోపించారు. మెహ్తాబ్ కేసును విచారించిన ఓ పోలీస్ అధికారిని ఆయన టార్గెట్ చేసినట్లు గతంలో సుప్రీం కోర్టే పేర్కొందని చెప్పుకొచ్చారు. కేంద్రం తరుపున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ ఘటనపై ఎన్ఐఏతో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టును కోరారు. పంజాబ్ ఘటన అంతర్జాతీయంగా తలవంపులు తీసుకొచ్చిందన్నారు.


కాగా, రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ పంజాబ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఫిరోజ్‌పూర్ వెళ్లే మార్గంలో రైతుల నిరసనతో ఆయన కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌పై ఆగిపోవాల్సి వచ్చింది. ఆందోళనకారులు అక్కడి నుంచి కదలకపోవడంతో సుమారు 20 నిమిషాల పాటు ప్రధాని కాన్వాయ్ ఫ్లైఓవర్‌ పైనే చిక్కుకుపోయింది. ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో ప్రధాని తన పర్యటన రద్దు చేసుకుని వెనుదిరిగారు. ప్రధాని పర్యటనపై సమాచారమిచ్చినప్పటికీ పంజాబ్ ప్రభుత్వం, అక్కడి పోలీసులు నిర్లక్ష్యంగా వహించారని... అందుకే భద్రతా వైఫల్యం (PM Security Lapse) చోటు చేసుకుందని కేంద్రం ఆరోపిస్తోంది. మరోవైపు పంజాబ్ ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. 


Also Read: Breaking News: టీఆర్​ఎస్​ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్- సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిర్ణయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook