అసోంలోని చారదియో జిల్లాలో కలకలం రేగింది. ముఖ్యమంత్రి శర్బానంద్ సోనోవాల్ పర్యటన నేపథ్యంలో జిల్లాలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో ఐదుగురు మిలిటెంట్లను అరెస్టు చేయడం కలకలం రేపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చారదియో జిల్లాలోని తరై గ్రామంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా.. ఓ ఇంట్లో అనుమానాస్పదంగా వ్యక్తులు  కనిపించారు. దీంతో ఆ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు పెద్ద ఎత్తున ఆయుధాలు పట్టుబడ్డాయి. వాటిని  పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారంతా యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం.. ULFAకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారికి ఆశ్రయం ఇచ్చిన ఇంటి యజమానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ULFAకు చెందిన ఈ వ్యక్తులు అసోం-అరుణాచల్ ప్రదేశ్- నాగాలండ్  సరిహద్దుల్లో పని చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 


పట్టుబడ్డ మిలిటెంట్లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిని అపుర్బా గొగోయ్  అలియాస్ ఆరోహన్ అసోం, సిమంత గొగోయ్ అలియాస్ మైనాగా గుర్తించారు. వారిద్దరూ బాంబులు పెట్టడంలో నిపుణులని పోలీసులు చెబుతున్నారు. మిగతా ముగ్గురిని బీరజ్ అసోం అలియాస్ యోగేన్ గొగోయ్, లక్ష్యజిత్ గొగోయ్ అలియాస్ ధ్రుబో అసోం, సిద్ధార్థ గొగోయ్ అలియాస్ హిన్మయ్ అసోం గా గుర్తించారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..