Post Office Interest Rates: కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటే చిన్న మొత్తాల పొదుపు పధకాలపై వడ్డీ రేట్లను పెంచే యోచన చేస్తోంది. ముఖ్యంగా పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్స్, పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర ఇందులో ముఖ్యమైనవి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, జీరో రిస్క్ కావడంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో త్వరలో పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం పెంచవచ్చని తెలుస్తోంది. ప్రధానంగా పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్, పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర పధకాలపై వడ్డీ రేట్లను పెంచవచ్చు. 2024 జనవరి-మార్చ్ నెలల్లో కొత్త వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది. 5 ఏళ్ల పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంపై ప్రభుత్వం క్రమంగా వడ్డీ పెంచుతోంది. 


గత త్రైమాసికంలో ప్రభుత్వ సెక్యురిటీలపై వచ్చిన ఆదాయం ఆధారంగా స్మాల్ సేవింగ్ పధకాలపై వడ్డీని లెక్కిస్తారు. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీలు 7 నుంచి 7.2 శాతం ఆదాయం ఇస్తున్నాయి. వీటి అంచనా 7.1 నుంచి 7.2 మధ్య ఉంది. ద్రవ్యోల్బణం రేటు 5-6 మధ్య ఉండవచ్చని అంచనా. ఈ పరిస్థితుల్లో స్మాల్ సేవింగ్ పథకాలపై వడ్డీ రేట్లలో మార్పులు రావచ్చు.


స్మాల్ సేవింగ్ పథకాలపై ప్రస్తుతం లభిస్తున్న వడ్డీ రేట్లు ఇలా


1 ఏడాది పోస్టాఫీసు ఎఫ్‌డిపై 6.9 శాతం వడ్డీ
2 ఏళ్ల పోస్టాఫీసు ఎఫ్‌డిపై 7 శాతం వడ్డీ
3 ఏళ్ల పోస్టాఫీసు ఎఫ్‌డీపై 7 శాతం వడ్డీ
5 ఏళ్ల పోస్టాఫీసు ఎఫ్‌డిపై 7.5 శాతం వడ్డీ
5 ఏళ్ల పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్‌పై 6.7 శాతం వడ్డీ
నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్‌పై 7.7 శాతం వడ్డీ
కిసాన్ వికాస్ పత్రపై 7.5 శాతం వడ్డీ
పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం వడ్డీ
సుకన్య సమృద్ధి యోజనపై 8 శాతం వడ్డీ
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై 8.2 శాతం వడ్డీ
మంత్లీ ఇన్‌కం స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ


వివిధ రకాల సేవింగ్ పథకాలపై వడ్డీ రేటు ఏడాదికి 4 నుంచి 8.2 శాతం వరకూ ఉంది. పీపీఎఫ్‌పై ప్రభుత్వం 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. త్వరలో ఈ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. 


Also read: SIP Superhit Scheme: నెలకు 1000 రూపాయల పెట్టుబడి చాలు 35 లక్షలు ఆర్జించే అవకాశం ఎలాగంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook