ADIPURUSH: బాహుబలితో ప్యాన్ ఇండియా హీరోగా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్.. శ్రీరాముడిగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణంలోని కీలక అంశాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఆదిపురుష్ తాజాగా పొలిటికల్ రంగు పులుముకుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ అజెండాలో భాగంగా ఆదిపురుష్ చిత్రం తెరకెక్కుతోందంటూ కామెంట్ చేశారు కేటీఆర్. దేశం మొత్తం బీజేపీ భావజాలం వ్యాప్తి చేసేందుకు 16 సినిమాలను తెరకెక్కిస్తున్నారన్నారు. ఉరి ది సర్జికల్ స్టైక్, కశ్మీర్ ఫైల్స్‌ లాంటివి ఇప్పటికే విడుదలయ్యాయనీ.. ఇప్పుడు ఆదిపురుష్ విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


ఆదిపురుష్ కూడా పొలిటకల్ అజెండాలో భాగంగా తెరకెక్కిస్తున్న సినిమా అంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభాస్ తాజా చిత్రం ద్వారా మరోసారి శ్రీరాముడి సెంటిమెంట్ పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రామ రాజ్యం అంటే బీజేపీ ప్రభుత్వం అనే భావన కల్పించే ప్రయత్నంలో భాగమే ఇదంతా అంటూ వ్యాఖ్యానించారు.


ఎన్నికల ముందు ఇలాంటి చిత్రాలు విడుదల చేసేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందనీ .. ఈ చిత్రాల్లో దేశభక్తి, ఆ పార్టీ సిద్ధాంతాలు అంతర్లీనంగా ఉంటాయంటూ  కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ట్యాక్స్ తగ్గించి మరీ ఆడియన్స్ పెరిగేలా ప్రచారం నిర్వహిస్తారన్నారు. తద్వారా బీజేపీ తన భావజాలాన్ని ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ ప్లాస్ ప్రభాస్‌కి కూడా తెలిసి ఉండొచ్చంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.


 ఆదిపురుష్‌ గురించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. మీ రాజకీయాల్లోకి మా హీరోను ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పౌరాణిక పురుషుడైన రాముడి పాత్ర చేస్తే తప్పేంటి అని ప్రశ్నల వర్షం సంధిస్తున్నారు. తమ హీరో జోలికి వస్తే బాగుండదని ఫైర్ అవుతున్నారు. దేశభక్తి, ఇతిహాసాలను సినిమాలుగా తీస్తే తప్పేముందనీ.. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరమేంటని అంటున్నారు.


Also See: Acharya Ticket Price Hike: ఆచార్య టికెట్ల పెంపునకు అనుమతిచ్చిన తెలంగాణ సర్కార్!


Also See: Frustration on Ola: ఓలా స్కూటర్‌పై వినూత్నరీతిలో నిరసన, గాడిదకు కట్టి ఊరేగింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.