PMGKAY extended: ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో ఆరు నెలలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు. ఏడాది సెప్టెంబర్ వరకు ఈ పథకం అమలులో ఉంటుందని వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో పేదలెవరూ ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతోనే మరో ఆరు నెలలు పీఎంజీకేఏవై పథఖాన్ని పొడగించినట్లు కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్ వెల్లడించారు. కరోనా దాదాపు ముగింపు దశకు చేరినా.. పేదల పట్ల మోదీ ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తోదన్నారు.


ఏమిటి ఈ ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్​ అన్న యోజన..


కరోనా కాలంలో ఎంతో మంది ఆదాయాలు తగ్గిపోయాయి. రోజువారీ కూలీలు మొదలుకుని.. ఎంతో మంది ఉద్యోగాలు లేక నిత్యవసరాలు కొనుగోలు చేయలేని పరిస్థితులు తలెత్తాయి. దీనితో ఎవరూ ఆకలితో బాధపడొద్దనే ఉద్దేశంతో.. ప్రధాన మంత్రి గరీబ్​ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రారంభించింది కేంద్రం. 2020 ఏప్రిల్​లో ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది.


ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 1,003 టన్ను ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేసింది. 


ఇప్పటి వరరకు ఈ పథకానికి కేంద్రం రూ.2.6 లక్షల కోట్లు ఖర్చరు చేసింది ప్రభుత్వం. రానున్న 6 నెలల్లో మరో రూ.80 వేల కోట్ల వరకు ఖర్చు చేయొచ్చని అంచనాలు ఉన్నాయి. దీనితో ఈ పథకం కోసం మొత్తం రూ.3.4 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం.


Also read: Congress Protests: మార్చి 31న డప్పులు, గంటలు మోగించండి... దేశ ప్రజలకు కాంగ్రెస్ పిలుపు


Also read: Video: గుండెలు పిండేసే వీడియో.. కూతురి శవాన్ని భుజాలపై 10కి.మీ మోసుకెళ్లిన తండ్రి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook