భారత మాజీ రాష్ట్రపతి , మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ..  ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రూపొందుతోంది. ఆ సినిమా టైటిల్  అబ్దుల్ కలాం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవ్ దేకర్ .. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జీవితంలో అంకిత భావం ఉంటే .. మనిషి ఎంత ఉన్నత స్థానానికి ఎదుగుతాడనే ఇతివృత్తంతో సినిమాను తీర్చిదిద్దుతున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"181848","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


సినిమా బాలీవుడ్, టాలీవుడ్ కాంబినేషన్ లో రూపొందుతోంది. ఈ చిత్రానికి జగదీష్ దనేటి, సువర్ణ పప్పు, జాన్ మార్టిన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలామ్ పాత్రను హాలీవుడ్ కు చెందిన మెహమూదీ అలీ పోషిస్తున్నాడు. ఈ సినిమాలో తెలుగు హాస్య నటుడు అలీ కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తుండడం విశేషం. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా నటుడు అలీ కూడా కార్యక్రమంలో పాల్గొన్నాడు. అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ సినిమా ఈ ఏడాది చివరి వరకు రిలీజ్ అవుతుంది.