Prashant kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన కారణంతో రాజీనామా చేసినట్టు తెలుస్తున్నా...ప్రజా జివితం నుంచి కాస్త విరామం కోసమని చెబుతున్నారు. పీకే రాజీనామా వెనుక కారణమేంటంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌కు ప్రదాన సలహాదారుడిగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant kishor)వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడాయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఇదే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రజా జీవితం నుంచి తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుంటున్నానని పీకే ప్రకటించినా..రాజీనామా వెనుక వేరే ప్రత్యేక కారణాలున్నాయనే టాక్ నడుస్తోంది. అటు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ కూడా పీకే రాజీనామాను ఆమోదించనున్నారని తెలుస్తోంది. ఎందుకంటే పీకే రాజీనామా వెనుక కారణం ఆయనకు స్పష్టంగా తెలుసు. 


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు(Punjab Assembly Elections) వచ్చే ఏడాది జరగనున్నాయి. త్వరలో పీకే కాంగ్రెస్ పార్టీలో చేరి..ఎన్నికల కోసం పని చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress party) నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఒక పదవి ప్రకారం ప్రభుత్వ సలహాదారుడి పదవికి రాజీనామా సమర్పించారని తెలుస్తోంది. ఇప్పుడిక నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరి..రాజకీయంగా కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. 


Also read: చిక్కుల్లో బైజుస్, యజమాని రవీంద్రన్‌పై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook