Prashanth Kishore: దేశంలో ప్రస్తుతం ఫ్రంట్ ల మీద చర్చ జరుగుతోంది. ఎన్డీఏ కూటమి వరుసగా రెండోసారి అధికారం చెలాయిస్తోంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ కూటమి ప్లాన్ చేస్తోంది. మోడీ సర్కార్ ను ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అదే సమయంలో కొత్త కూటములపైనా చర్చ జరుగుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడో ప్రత్యామ్నాయ కూటమి దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలకు కూడగట్టే యోచనలో మమత ఉన్నారని ప్రచారం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ పైనా జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. కేసీఆర్ కూడా ఇటీవల తరుచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల ముఖ్యమంత్రులు, అధ్యక్షులతో చర్చలు జరిపారు. అయితే కొత్త కూటమి ఏర్పాట్లు మాత్రం ముందుకు సాగుతున్నట్లు కనిపించడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతీయ స్థాయిలో జరుగుతున్న కొత్త కూటముల అంశంలో స్పెషల్ పర్సన్ గా ఉన్నారు జాతీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆయన డైరెక్షన్ లోనే బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలు ఏకమవుతున్నాయనే వార్తలు వచ్చాయి. అటు మమత.. ఇటు కేసీఆర్ తో మంతనాలు జరిపారు పీకే. తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. సోనియాతో పాటు కాంగ్రెస్ అగ్ర నేతలతో రోజుల తరబడి రహస్య సమావేశాలు నిర్వహించారు ప్రశాంత్ కిషోర్. 2024 ఎన్నికలకు సంబంధించి సోనియాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో పీకే కాంగ్రెస్ లో చేరబోతున్నారని.. ఆయన డైరెక్షన్ లోనే కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలు ఉంటాయని ప్రచారం సాగింది. కాని చివరకు కాంగ్రెస్ లో చేరేందుకు నిరాకరిస్తూ పీకే ప్రకటన చేయడంతో కొత్త కూటముల సంగతి మళ్లీ మొదటికొచ్చింది.


కాంగ్రెస్ లో చేరేది లేదని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. తాజాగా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. బీజేపీని ఓడించడం ఎలా సాధ్యమే వివరించారు. ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన పీకే.. దేశంలో మూడు, నాలుగో ఫ్రంట్ లు అవసరం లేదన్నారు. కమలం పార్టీని ఓడించాలంటే.. రెండో కూటమి ఏర్పడటం ఒక్కటే మార్గమన్నారు పీకే. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తేనే.. ఆ పార్టీని ఇంటికి పంపించడం సాధ్యమవుతుందన్నారు. మూడో ఫ్రంట్ కు దేశంలో అవకాశం ఉంటుందని తాను భావించడం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. బీజేపీ ఒక ఫ్రంట్ గా ఉంటే.. దాన్ని వ్యతిరేకించేవాళ్లంతా మరో ఫ్రంట్ గా ఏకం అయితేనే ఏదైనా సాధ్యమన్నారు. బీజేపీని కాంగ్రెస్ ఎదుర్కొగలదా అన్న ప్రశ్నకు స్పందించిన పీకే.. కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు లేవని చెప్పడం సరికాదన్నారు. హస్తం పార్టీలో కొన్ని మార్పులు చేస్తే.. మళ్లీ గాడిలో పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంటుందని.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా జాతీయ ఫలితాన్ని అంచనా వేయలేమని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.


READ ALSO: CJI NV Ramana: న్యాయమూర్తులు పరిధి దాటవద్దు..జస్టిస్ ఎన్‌వి రమణ వ్యాఖ్యల ఆంతర్యమేంటి


Balka Suman VS Jagga Reddy : పోశమ్మ గుడిలో పొట్టేలులా జగ్గారెడ్డి! మళ్లీ రెచ్చిపోయిన బాల్క సుమన్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.