ప్రస్తుతం ఏటా నిర్వహిస్తున్న ప్రవాస భారతీయ దినోత్సవాన్ని 2019 నుంచి రెండేళ్లకొకసారి నిర్వహిస్తామని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. ‘సామర్థ్య నిర్మాణం- కృత్రిమ మేధ వంటి అంశాల్లో ప్రవాస భారతీయుల పాత్ర’, ‘ప్రవాసులు మాతృభూమికి చేయగలిగిందేమిటి? భారత్‌ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలో ప్రవాస భారతీయుల పాత్ర’ వంటి అంశాలతో థీమ్‌ ఆధారిత సెషన్లను చేపట్టుతామని అన్నారు.


2019లో ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో నిర్వహించనున్నారు. జనవరి 21 నుంచి 23 వరకు ఈ దినోత్సవం జరుగుతుంది. ఆ సమయంలో ఎన్నారైలు గంగలో కుంభస్నానం చేయవచ్చని, జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వాషింగ్టన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది.