Droupadi Murmu: టీచరమ్మగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. క్లాసులో విద్యార్థులకు పాఠాలు.. వీడియో వైరల్..
Droupadi murmu teachings: భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు తీసుకుని ఈ రోజుతో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో.. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు క్లాసు బోధించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
President droupadi murmu teachings class in delhi: భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు స్వీకరించి ఈ రోజుతో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ముర్ము.. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ తొమ్మిదో తరగతి విద్యార్థులతో సరదాగా మాట్లాడారు. కాసేపు కొన్ని అంశాలపై విద్యార్థులతో ముర్ము ముచ్చటించారు. దేశ ప్రథమ పౌరురాలు కాస్త, టీచరమ్మగా మారారు. ఈ క్రమంలో విద్యార్థులకు గ్లోబల్ వార్మింగ్, పర్యావరణం , కాలుష్యం వంటి పలు అంశాలపై మాట్లాడారు.
తొమ్మిదో తరగతి విద్యార్థుల బృందాన్ని ఉద్దేశించి ప్రెసిడెంట్ ముర్ము వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి నీటి సంరక్షణ, అటవీ పెంపకం వంటివి చేపట్టాలని సూచించారు. అదే విధంగా నీటి వృధాను అరికట్టాలని, వర్షపు నీటి సంరక్షణ చేపట్టాలని కూడా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మదర్స్ డేను ఎందుకు చేసుకుంటామో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రుల గొప్పతనం గురించి వివరించారు. అంతేకాకుండా.. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 'ఏక్ పెద్ మా కే నామ్' కార్యక్రమంను ఊటంకిస్తూ.. పర్యావరణ పరిరక్షణకు వ్యక్తిగతంగా పాటు పడాలన్నారు. యువత అందరు.. తమ పుట్టినరోజుల సందర్భంగా మొక్కలు నాటాలని కూడా విద్యార్థులను ఆమె ప్రోత్సహించారు.
అదే విధంగా అందరు కూడా గ్లోబర్ వార్మింగ్ ను తగ్గించేందుకు పాటుపడాలన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రపది ద్రౌపది ముర్ము విద్యార్థులకు క్లాసు బోధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రపది ద్రౌపది ముర్ము జూన్ 20, 1958న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని ఉపర్బెడ గ్రామంలో జన్మించారు. మన దేశానికి రాష్ట్రపతిగా ముర్ము.. 2022 జూలై 25న భారతదేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Read more: Bottle gourd: ఇదేం విడ్డూరం.. యువకుడి పొట్టలో తొడిమతో ఉన్న సోరకాయ.. అసలేం జరిగిందంటే..?
ముర్ము రాష్ట్రపతి పదవికి ముందు, ఆమె 2015 నుండి 20215 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేశారు. అత్యున్నత పదవిని ఆశ్రయించిన తొలి ఆదివాసీ వ్యక్తిగా, అతిపిన్న వయస్కురాలిగా కూడా ముర్ము రికార్డును క్రియేట్ చేశారు. 1994-97 ల మధ్య రాయ్ రంగ్ పూర్ లోని శ్రీ అరబిందో ఇంటిగ్రెల్ ఎడ్యుకేషన్ సెంటర్ లో టీచర్ గా కూడా పనిచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి