న్యూఢిల్లీ: నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం నాడు తిరస్కరించారు. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాల్సి ఉండగా, వినయ్ వర్మ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్న కారణంగా ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ఉరిశిక్ష అమలుపై స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న వినయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించడం గమనార్హం. వినయ్ కుమార్ క్షమాభిక్ష రద్దయిందని కేంద్ర హోంశాఖ అధికారులు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: నిర్భయ భయానక ఘటన రోజు ఏం జరిగింది? 


కాగా, జనవరి 29న వినయ్ శర్మ క్షమాభిక్ష పటిషన్ దాఖలు చేశాడు. అయితే ఉరిశిక్షను కొన్ని రోజులు పొడిగించేందుకు నిర్భయ కేసు దోషులు పిటిషన్లు దాకలు చేస్తున్నారని తిహార్ జైలు అధికారులు సైతం కోర్టుకు వివరించారు. అయితే చట్టప్రకారం న్యాయపరమైన విధానాలను పాటించడంలో భాగంగా కోర్టు వారి ఉరిశిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. నిర్భయ తల్లి ఆశా దేవి మాత్రం దోషులకు శిక్షపడే వరకు పోరాటం కొనసాగిస్తానంటూ శుక్రవారం సైతం కన్నీటి పర్యంతమయ్యారు. క్షమాభిక్ష రద్దయినప్పటి నుంచి 14రోజుల తర్వాత దోషులను ఉరితీయాలన్న నిబంధన ఉంది. దీంతో ఫిబ్రవరి 15 లేక ఫిబ్రవరి 16తేదీలలో ఉరితీసే అవకాశం ఉంది.


Also Read: ఉరిశిక్ష వేసే ముందు నిజంగానే చివరి కోరిక అడుగుతారా?


వినయ్ కుమార్ మినహా ముఖేష్ కుమార్,  పవన్ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌ల న్యాయపరమైన అన్ని అవకాశాలు వినియోగించుకున్నారని, వారు ముగ్గురికి ఉరిశిక్ష అమలు చేయవచ్చునని మొదట భావించారు. అయితే ఒకే కేసులో శిక్ష పడ్డ అందరికీ ఒకేసారి తీర్పును అమలు చేయాలన్న నిబంధనతో కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వేచిచూడాలని సూచించింది.


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..