Ramnath kovind: భారత రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్యం మెరుగపడింది. చాతీ నొప్పితో ఎయిమ్స్‌లో చేరిన రాష్ట్రపతి కోవింద్‌ను ఐసీయూ నుంచి స్పెషల్ వార్డుకు తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తీవ్రమైన ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురైన రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌‌(Ramnath kovind)ను మార్చ్ 27వ తేదీన ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి ( AIIMS Hospital) కి రిఫర్ చేసి పంపించారు. సాధారణ వైద్య పరీక్షల అనంతరం రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. మార్చ్ 30 న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజయవంతంగా బైపాస్ సర్జరీ నిర్వహించారు. 


ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు తరలించారు. రాష్ట్రపతి ఆరోగ్యం మెరుగుపడిందని..కోలుకుంటున్నారని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. వైద్యుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతోంది. కొద్దిరోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. 


Also read: Coronavirus alert: మోగుతున్న ప్రమాద ఘంటికలు, కరోనా కొత్త కేసుల్లో ఇండియాదే అగ్రస్థానం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook