భాగ్యనగరంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సతీసమేతంగా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు.
భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సతీసమేతంగా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. సీఎం కేసీఆర్, హైదరాబాద్ ప్రధమ పౌరుడు బొంతు రామ్మోహన్ ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్రపతి శీతాకాల విడిది నిమిత్తం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ నెల 27వరకు బస చేస్తారు. ఆయన రాక సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయన వెళ్లేవరకూ బొల్లారం పరిసరాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
కాగా, ఈ రోజు రాత్రి 7 గంటలకు గవర్నర్ దంపతులు రాష్ట్రపతి దంపతులకు రాజ్ భవన్ లో విందు ఇవ్వనున్నారు. ఈ డిన్నర్ కు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ నెల 27న రాష్ట్రపతి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వెళతారు.