Sunny Leone: బాలీవుడ్ నటి సన్నీలియోన్ (Sunny Leone) నటించిన లేటేస్ట్ వీడియో ఆల్బమ్‌ ‘మధుబన్‌ మే రాధిక నాచే’ (Madhuban Mein Radhika Nache). ఇప్పడు ఆ ఆల్బమ్‌ వివాదంలో చిక్కుకుంది. 'మధుబన్'పై నిషేధం విధించాలని బృందావనం పూజారులు (Vrindavan priests) డిమాండ్ చేస్తున్నారు.  డిసెంబర్ 22న విడుదల చేసిన ఈ సాంగ్ లో సన్నీ డ్యాన్స్‌లు.. తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలాఉన్నాయని పూజారులు ఆరోపించారు. ఓ హిందుత్వ సంస్థ కూడా సన్నీకి వ్యతిరేకంగా శనివారం నిరసన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ.. సంస్థ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

.''రాధా నర్తకి కాదు.. భక్తురాలు. మధుబన్ పవిత్ర ప్రదేశం. రాధా మధుబన్ లో ఇలా డాన్స్ చేయలేదు. ఇది సిగ్గుపడే సాహిత్యం'' అంటూ సోషల్ మీడియా(Social Media) వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఆల్బమ్‌ను నిషేధించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ 22న 'మధుబన్' పేరుతో సన్నీ లియోన్ నటించిన వీడియో ఆల్బమ్ 'సరేగమ మ్యూజిక్' ద్వారా ఇటీవల విడుదల చేయబడింది. ఈ ఆల్బమ్‌లో కనికా కపూర్, అరిందమ్ చక్రవర్తి పాడారు. ఈ పాటను నిజానికి 1960లో కోహినూర్ చిత్రం కోసం మహమ్మద్ రఫీ అలపించారు. 


Also Read: Pushpa Movie: అసలు అల్లు అర్జున్‌ని సుకుమార్ నగ్నంగా చూపించాలనుకున్నాడా..ఎందుకు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి