PM Modi Visits Leh: లేహ్‌లో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటన
లడాఖ్ గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా దురాఘాతానికి పాల్పడ్డనాటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ( PM Narendra Modi ) స్వయంగా లడాఖ్‌లోని లేహ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వెంట సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ( Bipin Rawat ), ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే ( Manoj Mukund Naravane ) కూడా ఉన్నారు.
PM Narendra Modi: న్యూఢిల్లీ: లడాఖ్ గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా దురాఘాతానికి పాల్పడ్డనాటి నుంచి భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్వయంగా లడాఖ్‌లోని లేహ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వెంట సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ( Bipin Rawat ), ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే ( Manoj Mukund Naravane ) కూడా ఉన్నారు. Read also: భారత్‌లో ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదు
లేహ్ నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్ఏసీ ( LAC ) నిమ్మో ( Nimmoo ) వద్ద వద్ద ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రధాని మోదీ, సీడీఎస్, ఆర్మీ చీఫ్‌కు 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ వివరించారు. ఈ ప్రదేశం జాస్కర్ ఇండస్ నదుల సంగమం ( Zanskar - Indus river range ) వద్ద ఉంది. ఈ వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర ఇరు దేశాల సైన్యాలు సుదీర్ఘ కాలం నుంచి ఎదురెదురుపడుతున్నాయి. అయితే ఈ సందర్భంగా ప్రధాని మోదీ భద్రతాపరమైన అంశాలు, చర్యల గురించి సైన్యాధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. Read also: యూపీలో దుండగుల కాల్పులు: డీఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతి
ఉదయం 8.15 గంటలకు ప్రధాని మోదీ లేహ్‌కు ( PM Modi in Leh ) చేరుకున్న వెంటనే వైమానిక దళం, ఆర్మీ, ఐటీబీపీ సిబ్బందితో భేటి అయ్యారు. అనంతరం గాల్వన్ లోయలో ( Galwan Valley ) గాయపడిన సైనికులను పీఎం మోదీ పరామర్శించనున్నారు. గతంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ( Rajnath Singh ) లేహ్‌ను సందర్శించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన పర్యటన రద్దయింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..