Narendra Modi: తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఆదిలాబాద్‌లో సోమవారం జరిగిన అధికారిక కార్యక్రమం అనంతరం జరిగిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 'నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం' అంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'ఇది ఎన్నికల సభ కాదు. అభివృద్ధి ఉత్సవం' అని ప్రకటించారు. 'ఈ 15 రోజుల్లో రెండు ఐఐటీలు, 3 ఐఐఎం, ఐఐఎస్ సంస్థలు, రైల్వే, ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నాం. ఎన్నికలు వస్తే రానీ అప్పుడు చూసుకుందాం. కానీ నాకు దేశాభివృద్ధి ముఖ్యం. కేంద్ర మంత్రులతో నిన్న భేటీ అయ్యాం కానీ ఎన్నికలకు సంబంధించిన చర్చ కాకుండా వికసిత్ భారత్‌పై చర్చలు జరిపాం' అని వివరించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KCR Meeting: 12న గులాబీ గర్జన.. సార్వత్రిక సమరానికి మాజీ సీఎం కేసీఆర్‌ సై


'తెలంగాణలోని ప్రతి మారుమూల ప్రాంతం నుంచి కొత్త ఓటర్లు, రైతులు, కార్మికులంతా ఒక్కటే మాట్లాడుకుంటున్నారు. అబ్ కీ బార్ 400 పర్' అని తెలిపారు. బీజేపీకి ఓటు వేయాలి నాలుగు వందలు దాటాలి అని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఎలాంటి అభివృద్ధి ఇక్కడ జరగలేదని పేర్కొన్నారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు మొదలైందని చెప్పారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా ఊహించారా? ప్రశ్నించారు. బిర్సా ముండ జయంతిని జాతీయ ఉత్సవంగా జరుపుకుంటారని ఎవరైనా ఊహించారా? అని అడిగారు. ఇవన్నీ సాధ్యమయ్యాయంటే బీజేపీ వల్లేనని స్పష్టం చేశారు. కుటుంబ పార్టీల వల్ల ఎటువంటి అభివృద్ధి జరగదని తెలిపారు.

Also Read: Kallu Bar: తాగుబోతులకు రేవంత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. మందు బార్ల మాదిరి కొత్తగా 'కల్లు బార్లు'


'చెంచు, కోలం, కొండరెడ్డి వంటి చిన్న చిన్న జాతుల సంక్షేమానికి రూ.26 వేల కోట్లు కేటాయించాం. తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. పసుపు బోర్డు ఏర్పాటుచేశాం. కనీస మద్దతు ధరను కల్పించాం. దేశంలో 7 మెగా టెక్స్ టైల్ పార్క్ లు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలోనూ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. మోడీ గ్యారంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారంటీ. భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతా. అభివృద్ధి అంటే దళిత, గిరిజనులు పేదరికాన్ని జయించడం. ' అని మోదీ వివరించారు.


బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై మోదీ విమర్శలు చేశారు. 'ఏక్ ఝూట్.. దూస్ రా లూట్. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారింది కానీ ప్రజల పరిస్థితులు మారలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పరిస్థితి మారదు. ఈ రెండూ ఒక్కటే. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని చేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం దానిపై ఎలాంటి విచారణకు ఆదేశించడం లేదు. నువ్వూ తిను నేనూ తింటా అన్నట్లుగా వారి తీరు ఉంది' అని పేర్కొన్నారు. 'అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోలో ఎన్నో పెట్టారు.. వాటిని అమలు చేశారా?' అని ప్రశ్నించారు.


'మోదీకి కుటుంబం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. నా జీవితం తెరిచిన పుస్తకం. నేను ఒక కల కోసం ఇల్లు వదిలి బయటకు వెళ్లాను. దేశం కోసం బతుకుతానని బయటకు వచ్చా. కేవలం మీ కోసమే. మీ కలలు నిజం చేయడమే నా సంకల్పం. 140 కోట్ల దేశ ప్రజలే నా కుటుంబం' అని స్పష్టం చేశారు. 'నేను మోడీ కుటుంబమని ప్రతి ఒక్కరూ చెప్పుకోవాలి' అని పిలుపునిచ్చారు. 'తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది. అయోధ్య రామ మందిరం తలుపుల ఏర్పాటు, ఆలయ నిర్మాణంలో తెలంగాణ ప్రధాన పాత్ర పోషించింది. నాకు తెలంగాణ ప్రజల ప్రేమ, ఆప్యాయత కావాలి. మీకు సేవ చేసేందుకు పరితపిస్తున్నాను' అని తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook