New Vaccination Policy: దేశంలో వ్యాక్సినేషన్ విధానంపై ఇంకా అస్పష్టత నెలకొంది. ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ సేకరణ కష్టమైపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యాక్సినేషన్ విధానం ఏం చెబుతోంది. ఎందుకు వ్యాక్సిన్ అందడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్(Vaccination)ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు కొత్త వ్యాక్సినేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. జూన్ 21 నుంచి అన్ని వయస్సులవారికి కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందని తెలిపింది. వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్రమే సేకరిస్తుందని..మిగిలిన 25 శాతం ప్రైవేటు ఆసుపత్రులు సేకరించుకోవచ్చని ప్రధాని మోదీ వెల్లడించారు.ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లకు వసూలు చేయాల్సిన కొత్త ధరను కూడా ప్రకటించారు. అయినా సరే ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ సేకరణ కష్టమైపోతోంది. ప్రధాని మోదీ(Pm Narendra modi) ప్రకటించిన వ్యాక్సిన్ నూతన విధానం (New Vaccination Policy) ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ల సేకరణపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు వెల్లడించాయి. అందుకే వ్యాక్సినేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పాయి. వ్యాక్సిన్ల కోసం భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్ కంపెనీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల్ని సంప్రదించినా...ఫలితం లేకపోయిందని తెలిపాయి. 


అదే సమయంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ (Serum Institute) రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్ కేంద్ర ఆరోగ్య శాఖకు రాసిన లేఖ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రైవేటు ఆసుపత్రుల్నించి ఎలాంటి ఆర్డర్లు,పేమెంట్లు తీసుకోవడం లేదని..ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్లు సరఫరా చేసే విషయంలో రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని సీరమ్ ఇనిస్టిట్యూట్ కంపెనీలో ప్రభుత్వ, రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రకాశ్ కుమార్ సింగ్ తెలిపారు. మరోవైపు వ్యాక్సిన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు సైతం తమకు స్పష్టత ఇవ్వడం లేదని ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.


Also read: Delhi Unlock: దేశ రాజధాని ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ, లాక్‌డౌన్ ఆంక్షల తొలగింపు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook