Priyanka Gandhi UP Election: ‘కాంగ్రెస్ గెలిస్తే బాలికలకు ఉచితంగా బైక్, స్మార్ట్ ఫోన్.. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్‘
Priyanka Gandhi UP Election: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం (Congress Pratigya Yatra) మొదలుపెట్టింది. ప్రచారంలో భాగంగా ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టడం సహా మహిళల కోసం ప్రత్యేకంగా హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా తెలిపారు.
Priyanka Gandhi UP Election: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ పార్టీ (UP Congress News) హమీల జల్లు కురిపిస్తుంది. పార్టీ తరఫున బాలికలకు ద్విచక్ర వాహనాలతో పాటు స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా (Priyanka Gandhi Latest News) అన్నారు. అంతే కాకుండా పార్టీలో 40 శాతం టిక్కెట్లను మహిళలకు కేటాయించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు ప్రియాంకా గాంధీ వాద్రా.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే (Congress Pratigya Yatra) మహిళ సాధికారత కోసం పక్కా ప్రణాళికలను రూపొందిస్తామని ప్రియాంకా గాంధీ తెలిపారు. వీటితో పాటు అనేక హామీలను నేరవేరుస్తామని ట్విట్టర్ వేదికగా ఆమె ప్రకటించారు.
“ఉత్తరప్రదేశ్‌లోని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. బాలికలకు ద్విచక్ర వాహనం సహా స్మార్ట్ ఫోను అందజేస్తాం. అంతే కాకుండా పార్టీలో 40 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తాం. వితంతువులకు నెలకు రూ.వెయ్యి అందజేస్తాం. మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు, మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేసేందుకు చర్యలు తీసుకుంటాం. మహిళలకు అండగా ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తాం” అని ప్రియాంకా గాంధీ వాద్రా ట్విట్టర్ లో వెల్లడించారు.
రైతులకూ హామీలు..
ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లా నుంచి యాత్రను (Congress Pratigya yatra) జెండా ఊపి ప్రారంభించిన ప్రియాంక.. రైతులకు పలు హామీలు ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే అన్నదాతల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. వరి, గోధుమలకు రూ.2,500 కనీస మద్దతు ధర కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
దీంతో పాటు రాష్ట్రంలో 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రియాంక (Priyanka Gandhi news latest) తెలిపారు. కరోనా సంక్షోభం వల్ల ఎదురైన నష్టం నుంచి బయటపడేందుకు ఒక్కో పేద కుటుంబానికి రూ. 25 వేలు అందిస్తామని చెప్పారు. విద్యుత్ బిల్లులను పేద కుటుంబాలకు పూర్తిగా, మిగిలిన వారికి సగం మాఫీ చేస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు ప్రియాంక.. ఇప్పుడు దానిని ప్రస్తావిస్తూ బాలికలకు ఉచిత ఇ-స్కూటీ, మొబైల్ ఫోన్లు ఇస్తామని ఆమె పునరుద్ఘాటించారు.
Also Read: Sanjay Raut On Congress: ‘కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమే!’
Also Read: Gold price today: దేశంలో స్థిరంగా ఉన్న బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook