Cheetahs in India: భారత్‌లో చీతాల సంఖ్య పెరుగుతుంది. గత ఏడాది నమీబియా నుండి 8 చీతాలు భారత్ కు రాగా.. తాజాగా మరో 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చాయి. జోహన్నెస్‌బర్గ్‌ నుంచి చీతాలతో బయలుదేరిన సీ-17 విమానం ఇవాళ మార్నింగ్ 10 గంటలకు గ్వాలియర్ ఎయిర్‌బేస్‌లో దిగింది. అక్కడ నుంచి వాటిని మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కుకు తరలించారు. శనివారం మధ్యాహ్నాం వీటిని మధ్యప్రదేశ్ సీఎం  శివరాజ్‌ సింగ్ చౌహన్‌, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ కునో నేషనల్‌ పార్క్‌లోని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లలోకి విడుదల చేశారు. ఈ చీతాల్లో ఏడు మగవి, ఐదు ఆడవి ఉన్నాయి. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మహాశివరాత్రి సందర్భంగా మధ్యప్రదేశ్‌కు ఒక కానుక లభించింది. ప్రధాని మోదీకి ధన్యవాదాలు'' అంటూ సీఎం శివరాజ్‌ సింగ్  తెలిపారు. ఈ చీతాల కోసం అధికారులు 10 క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లు రెడీ చేశారు. భారతీయ వన్యప్రాణుల చట్టాల ప్రకారం, ఇతర దేశాలను వచ్చిన జంతువులను నెల రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి. గతేడాది సెప్టెంబర్‌లో నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను భారత్‌కు తీసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పుట్టినరోజు సందర్భంగా 2022  సెప్టెంబర్ 17న కునో నేషనల్ పార్క్‌ లో విడుదల చేశారు. 1948లో అప్పటి మధ్యప్రదేశ్ (ప్రస్తుత ఛత్తీస్ గఢ్) రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయింది. ఆ తర్వాత వీటి జాడ లేకపోవడంతో మన దేశం వీటిని 1952లో అంతరించిన జాతిగా ప్రకటించింది. 


Also Read: Devi Awards 2023: 'అదానీ’ స్పాన్సర్ అయితే.. అవార్డు నాకు వద్దు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook