వైద్య విద్య విధానంలో తమిళనాడు సర్కార్ సరికొత్త నిబంధన జోడించింది. వైద్య విద్యలో ప్రవేశం పొందాలంటే  సదరు విద్యార్ధి అతని తల్లిదండ్రులతో ఉన్న అనుబంధాన్ని రుజువు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఓ నోటీసు ఎస్ఎస్ సీ వెబ్ సైట్లో కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విద్యార్థులు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి (ఇంటర్ ) వరకు రాష్ట్రంలో చదవని పక్షంలో మాత్రమే వారు తమ తల్లిదండ్రులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సమర్పించాల్సి ఉంది.


సాధారణంగా వైద్య విద్య ప్రవేశానికి మార్కులు,ర్యాంక్ కార్డుతో పాటు  భర్త్ సర్టిఫికెట్, నేటివిటీ, ఇన్ కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు వంటి వివరాలు ఇవ్వాలి. దీనికి అదనంగా కొత్త నింబంధన జోడించడం గమనార్హం. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు ఈ నిబంధన వర్తిస్తుందని సంబంధిత అధికారి తెలిపారు.