Gyanvapi case: జ్ఞానవాపి మసీదులో దొరికిన శివలింగానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు వారణాసి కోర్టును ఆదేశించింది. మసీదులో ముస్లింలు నమాజ్‌కూడా చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ చంద్రచూడ్‌, పీఎస్‌ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. శివలింగం దొరికిన ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ పై విచారణ జరిపింది. అయితే మసీదులో ముస్లింలు నమాజ్‌ చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం అభ్యంతరం చెప్పలేదు. అటు ఇదే అంశంపై వారణాసి కోర్టులోజరుగుతున్న విచారణను ఆపేయాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేశారు. అయితే పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అటు మసీదులో వీడియో సర్వే చేయించాలన్న వారణాసి కోర్టు ఆదేశాలపై అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ పై సుప్రీం స్పందన కోరింది. దీనిపై స్పందించాలని హిందూ భక్తులకు, ఉత్తర ప్రదేశ్‌ సర్కార్‌ కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది.


మసీదు ప్రాంగణంలో నిర్వహించిన వీడియోగ్రఫీ సర్వే నివేదికను అందజేసేందుకు కమిషన్‌ ను వారణాసి కోర్టును మరింత గడువు కోరింది. కమిషన్‌ విజ్ఞప్తిమేరకు వారణాసి కోర్టు మరో రెండు రోజులు సమయం కేటాయించింది. మరోవైను కోర్టుకు సరిగ్గా సహకరించడం లేదని అడ్వకేట్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌ మిశ్రాను కమిషన్‌ నుంచి కోర్టు డిస్మిస్‌ చేసింది. అతని స్థానంలో అసిస్టెంట్‌ కోర్టు కమిషన్‌ అజయ్‌ ను నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.


Also Read: Tamil Nadu: క్వారీ ఘటనపై స్టాలిన్ ప్రభుత్వం సీరియస్..బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన..!


Also Read: Shikhar Dhawan: వెండి తెరపైకి మరో స్టార్ క్రికెటర్‌ రాబోతున్నారా..? నిజమెంత..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook