Public Holiday: ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ ప్రారంభమైంది. చలికాలం కావడంతో సెలవుంటే బాగుంటుందని విద్యార్ధులతో పాటు అందరూ ఆలోచిస్తుంటారు. అందుకు తగ్గట్టే డిసెంబర్ 12 అంటే ఎల్లుండి బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు ఈ రాష్ట్రంలో సెలవు ప్రకటించారు. ఎందుకు, ఎక్కడనేది చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి నెలా బ్యాంకుకు నిర్ధారిత సెలవులుంటాయి. ఇవి రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. అందుకే బ్యాంకు పనులుంటే మాత్రం సెలవులు ఎప్పుడున్నాయో ముందుగా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ విధానంలోనే నడుస్తున్నా కొన్ని ప్రత్యేక పనులుంటే మాత్రం బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంటుంది. అందుకే ఆర్బీఐ ముందుగానే ప్రతి నెలా సెలవుల జాబితా జారీ చేస్తుంటుంది. డిసెంబర్ నెలలో బ్యాంకులు మొత్తం 15 రోజులు పనిచేయవు. ఇప్పటికే డిసెంబర్ నెలలో 9 రోజులు పూర్తయ్యాయి. మిగిలిన 22 రోజుల్లో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. ఇందులో వీక్లీ హాలిడేస్ కూడా ఉన్నాయి. ఇక డిసెంబర్ 12వ తేదీ అంటే ఎల్లుండి గురువారం మాత్రం ఈ రాష్ట్రంలో పూర్తిగా సెలవుంది. ఆ రోజు స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ ఆఫీసులు, బ్యాంకులు పనిచేయవు.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే బ్యాంకుల సెలవుల జాబితాలో నేషనల్ , రీజనల్ హాలిడేస్ రెండూ ఉంటాయి. జాతీయ సెలవులుంటే దేశమంతా సెలవుంటుంది. ప్రాంతీయమైతే  రాష్ట్రాన్ని బట్టి ఉంటుంది. డిసెంబర్ 12న మేఘాలయలో పీఏ సంగ్మా వర్ధంతి పురస్కరించుకుని మేఘాలయలో సెలవు ఉంది. 


పీఏ తోగాన్ నెంగ్మింజా సంగ్మా మేఘాలయలోని గారో తెగకు చెందిన ఫ్రీడమ్ ఫైటర్. 1872 డిసెంబర్ 12న మరణించాడు.  బ్రిటీషుతో జరిగిన పోరాటంలో మరణించారు. నార్త్ ఈస్ట్ ఇండియాపై బ్రిటీషు ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటంలో పీఏ తోగాన్ నెంగ్మింజా సంగ్మా ప్రాణాలు కోల్పోయారు. 


Also read: Bank Holidays 2024: రేపట్నించి ఈ నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.