Puducherry Crisis: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. కారణాలు తెలియదు గానీ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన జరుగుతుండగానే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో 2-3 నెలల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ( Assembly Elections ) జరగనున్నాయి. ఈ క్రమంలో పుదుచ్చేరి ( Puducherry )లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి ( Puducherry cm narayana swamy ) ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఒక్కసారిగా నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం ఇరకాటంలో( Puducherry government crisis ) పడింది. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో  సమీక్ష జరిపేందుకు ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ ( Rahul gandhi )రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేల రాజీనామా పార్టీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది. 2-3 రోజుల క్రితమే యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ఎమ్మెల్యే పదవి, కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేశారు. మల్లాడి కృష్ణారావు ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే..మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 


30 మంది సభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీలో  కాంగ్రెస్ - డీఎంకే కూటమికు 16 మంది సభ్యుల బలముంది. విపక్షానికి 14 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల రాజీనామాతో అధికార పార్టీ బలం 11కు పడిపోయింది. ఈ పరిస్థితులతో ముఖ్యమంత్రి నారాయణ స్వామి అప్రమత్తమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ముఖ్య నేతలు,  సీనియర్లతో విడివిడిగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల రాజీనామాకు కారణాలింకా తెలియలేదు. మరీ ముఖ్యంగా యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ( Yanam mla malladi krishna rao ) రాజీనామా..ముఖ్యమంత్రి నారాయణ స్వామికి అంతుబట్టడం లేదు.యానాం నుంచి 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా సేవలందించిన మల్లాడి..ప్రజల మనిషిగా పేరు పొందారు. నారాయణ స్వామి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. 


Also read: Madhya pradesh Accident: వంతెన పై నుంచి కెనాల్‌లో పడిన బస్సు, 32 మంది మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook