Pune news: మహారాష్ట్ర పూణెలో విషాదం చోటుచేసుకుంది. వాఘోలీలోని రెసిడెన్షియల్ సొసైటీలో డ్రైన్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే...


శుక్రవారం ఉదయం 6 గంటలకు సోలాసియా ఫేజ్ II హౌసింగ్ సొసైటీ వద్ద గల సెప్టిక్ ట్యాంక్ లోకి ముగ్గురు కార్మికులు ప్రవేశించారు. గంట సేపు అయినా సరే వారు బయటకురాలేదు. 18 అడుగుల లోతు గల ఈ సెప్టిక్ ట్యాంక్ లో వీరంతా ఇరుకున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 


ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కార్మికుల మృతదేహాలను బయటకు తీశారు. ఊపిరాడకే మృతి చెందినట్లు వారు చెప్పారు.  కార్మికులను నితిన్ ప్రభార్ గోండ్ (45), గణేష్ భలేరావు (28), సతీష్‌కుమార్ చౌదరిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూణె సిటీ పోలీసులు విచారణ ప్రారంభించారు.


భారీ వాహనాలపై నిషేధం
పూణె-అహ్మద్‌నగర్ రహదారి వెంబడి కోరేగావ్ భీమా మరియు కొండాపురి మధ్య 20 కిలోమీటర్ల మార్గంలో మరియు 9 కిలోమీటర్ల షిక్రాపూర్-చకన్ మార్గంలో శుక్రవారం నుండి పక్షం రోజుల పాటు భారీ వాహనాలను ఉదయం 7-11 మరియు సాయంత్రం 4-8 గంటల వరకు నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ రాజేష్ దేశ్‌ముఖ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


Also Read: PM Modi: కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook