Punjab Congress: పంజాబ్ కాంగ్రెస్ మాజీ ఛీప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మరణావస్థలో ఉందంటూ వివాదం రాజేశారు. కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పనందుకు ఇంకా అసంతృప్తిగానే ఉన్నారాయన.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఘటనకు(Lakhimpur Kheri Incident) సంబంధించి పంజాబ్ కాంగ్రెస్ మాజీ ఛీప్ మొహాలి నుంచి లఖీంపూర్‌కు యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ప్రారంభానికి ముఖ్యమంత్రి రాక ఆలస్యం కావడంతో నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కోపమొచ్చింది. అసలే కాంగ్రెస్ పగ్గాలు పోయాయి. దానికి తోడు ముఖ్యమంత్రి రావడం ఆలస్యం కావడంతో అసహనం ఎక్కువైంది. అసహనంగా ఉన్న సిద్ధూను శాంతింపజేసేందుకు రాష్ట్ర మంత్రి పర్గాత్ సింగ్ చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో ఇప్పుుడు వివాదానికి దారి తీసింది. ముఖ్యమంత్రి వస్తారని చెప్పడం, యాత్ర విజయవంతమవుతుందని సీడబ్ల్యూసీ ఛీఫ్ సుఖ్విందర్ సింగ్ సముదాయించడం అంతా వీడియాలో స్పష్టంగా ఉంది. ఈ మాటలకు స్పందించిన సిద్దూ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు సంచలనంగా మారాయి.


విజయం ఎక్కడ, నాగు పగ్గాలు అప్పగించి ఉంటే మీకు విజయం కన్పించేది, ఇప్పుడు కాంగ్రెస్ మరణావస్థలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సిద్ధూ(Navjot singh sidhu) కోపం ఇంకా చల్లారలేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ ఛీఫ్ పదవికి రాజీనామా చేసిన సిద్దూ..అధిష్టానం బుజ్జగింపుతో మెత్తబడ్డారని అనుకున్నారు. రాజీనామాను మాత్రం అధికారికంగా ఉపసంహరించుకోలేదు. సిద్ధూకు దళితులపై గౌరవం లేదని..కేవలం కుల రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షం అకాళీదళ్ విమర్శించింది. అటు కాంగ్రెస్‌లో నెలకొన్న సమస్యలు కూడా అంత త్వరగా పరిష్కారం కావని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant kishor)అభిప్రాయపడ్డారు. లఖీంఫూర్ పూర్ ఘటనతో పార్టీకు పునర్ వైభవం వస్తుందనుకోవడం భ్రమేనని ట్వీట్ చేశారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ పునర్వికాసానికి లఖీంపూర్ ఘటన ఉపయోగపడుతుందని అందరూ ఆశిస్తున్నారని..అది కేవలం నిరాశగానే మారుతుందని ట్వీట్ చేశారు. 


Also read: Air India‌‌, tata deal : టాటా గూటికే మళ్లీ ఎయిర్ ఇండియా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook