Amarinder Singh : పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ఐఎస్ఐతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు
Amarinder Singh`s friend Aroosa Alam`s link with ISI : పాకిస్థాన్ డిఫెన్స్ జర్నలిస్ట్ అరూసా ఆలం ద్వారా ఐఎస్ఐతో కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై దర్యాప్తు సాగుతోందన్నారు. ఐఎస్ఐ నుంచి ముప్పు ఉందని కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇప్పుడు చెప్తున్నారని సుఖ్‌జిందర్ పేర్కొన్నారు.
Punjab govt to probe Amarinder Singh's friend Aroosa Alam's link with ISI - Minister Punjab Home Minister Sukhjinder Randhawa : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో (ISI) ఉన్న సంబంధాలపై దర్యాప్తు జరుపుతామంటూ పంజాబ్ హోమ్ మినిస్టర్ సుఖ్‌జిందర్ రణ్‌ధవా (Sukhjinder Randhawa) అన్నారు. పాకిస్థాన్ డిఫెన్స్ జర్నలిస్ట్ అరూసా ఆలం (Aroosa Alam) ద్వారా ఐఎస్ఐతో కెప్టెన్ సింగ్‌కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై దర్యాప్తు సాగుతోందన్నారు.
ఐఎస్ఐ నుంచి ముప్పు ఉందని కెప్టెన్ అమరీందర్ సింగ్ (Captain Amarinder Singh) ఇప్పుడు చెప్తున్నారని సుఖ్‌జిందర్ పేర్కొన్నారు. కెప్టెన్ సింగ్ నాలుగైదేళ్ళ నుంచి పాకిస్థాన్ (Pakistan) నుంచి వస్తోన్న డ్రోన్ల గురించి మాట్లాడుతున్నారన్నారు. ఈ విషయాన్ని మొదట లేవనెత్తినది కెప్టెన్ సింగ్ అని, ఆ తర్వాత పంజాబ్‌లో బీఎస్ఎఫ్ (BSF) దళాల మోహరింపు జరిగిందని అన్నారు. అరూసా ఆలంకు ఐఎస్ఐతో సంబంధాల గురించి ప్రస్తావిస్తూ.. ఈ అంశంపై దర్యాప్తు జరపాలని డీజీపీని (DGP) కోరుతామన్నారు.
Also Read : Natyam movie: ‘నాట్యం’ చిత్ర బృందానికి వెంకయ్యనాయుడు, బాలకృష్ణల అభినందలు
కెప్టెన్ అమరీందర్ సింగ్ 2004లో పాకిస్థాన్ వెళ్ళినపుడు డిఫెన్స్ జర్నలిస్ట్ అరూసా ఆలంను (Aroosa Alam) కలిశారు. అయితే పంజాబ్ రాజకీయాల్లో ఆమె పేరు రావడం ఇదే తొలిసారి ఏమీ కాదు. 2007లోనూ అరూసా ఆలం వార్తల్లోకెక్కారు. అప్పట్లో ఆమె చండీగఢ్ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ తాను కెప్టెన్ అమరీందర్ సింగ్ (Captain Amarinder Singh) స్నేహితురాలినని.. తాము ప్రేమలో పడలేదని చెప్పి వార్తల్లో నిలిచారు.
Also Read : Pawan Kalyan fans slams Dil Raju: దిల్ రాజుపై పవన్ కల్యాన్ ఫ్యాన్స్ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook