PM's security lapse: పంజాబ్​ ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ (Kangana Ranaut Comments on Punjab) అన్నారు. పంజాబ్​లో నిన్న ప్రధాని మోదీ కాన్వాయ్​ను నిరసన కారులు అడ్డుకోవడంపై.. ఇన్​స్టాగ్రామ్​ వేదికగా తప్పుబడుతూ ఈ వాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంజాబ్​లో జరిగిన ఘటన సిగ్గు చేటు చర్య అని అమె ఇన్​స్టాగ్రామ్​ స్టోరీలో (Kangana Instagram Story on PM Modi security lapse) రాసుకొచ్చారు. ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన నాయకుడని.. 140 కోట్ల మంది ప్రజల ప్రతినిధి/గొంతుక అని పేర్కొన్నారు.


అలాంటి వ్యక్తిపై దాడి ప్రతి భారతీయుడుపై దాడిగా పేర్కొన్నారు కంగనా రనౌత్​. ఇది మన ప్రజాస్వామ్యంపై కూడా దాడి అని కంగన మండిపడ్డారు.


ఇప్పుడు అడ్డుకోకుంటే..


ఈ ఘటన నేపథ్యంలో పంజాబ్​పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కంగనా రనౌత్​. పంజాబ్ ఉగ్రకార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందని.. ('Punjab is becoming a hub for terroristic activities') వాటిని ఇప్పుడు అడ్డుకోకుంటే.. దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.


#BharatStandwithModiji అనే ట్యాగ్​తో కంగన ఈ స్టోరీనీ పోస్ట్​ చేశారు.


అసలు ఏం జరిగిందంటే..


ప్రధాని మోదీ.. బుధవారం పంజాబ్​ హుస్సేనీవాలాలోని జాతీయ అమరవీరుల స్మారకాన్ని సందర్శించాల్సి ఉంది. అయితే పంజాబ్ చేరుకున్న మోదీ.. వాతావరణ అనుకూలించక.. రోడ్డు మార్గంలో స్మారకం వద్దకు బయల్దేరారు. అయితే దారిలో నిరసనకారులు ప్రధాని కాన్వాయ్​ను (PM Modi's convoy was stopped by protesters in Punjab) అడ్డగించారు. దీనితో ప్రధాని దాదాపు 20 నిమిషాలు కాన్వాయ్​లోనే ఉండాల్సి వచ్చింది. నిరసనల కారణంగా ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీ బయల్దేరాల్సి వచ్చింది. భద్రత లోపాల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు హోం శాఖ సీరియస్​ అయ్యింది.


ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. ప్రధాని కాన్వాయ్​ను అడ్డుకోవడంపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా (BJP on PM Modi security lapse) వ్యతిరేకిస్తున్నారు.


అయితే నిన్న జరిగిన ఈ ఘటన తర్వాత మోదీ క్షేమంగా బయటపడ్డందుకు పంజాబ్​ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి కృతజ్ఞతలు చెప్పడం (PM Modi Say thanks to CM Channi ) గమనార్హం.


Also read: Man Attacks Bindu Ammini: శబరిమల గుడిలోకి ప్రవేశించిన బిందు అమ్మినిపై దాడి.. వీడియో వైరల్


Also read: Tihar Jail Prisoner Suicide: తిహార్ జైలులో ఐదురుగు ఖైదీలు సూసైడ్ అటెంప్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook