Agriculture Loan In Punjab National Bank: ఉద్యోగులకు అయితే లోన్లు ఒక్క రోజులో వచ్చేస్తాయి. మరి రైతులకు అలా కాదు. బ్యాంక్‌ల చుట్టూ తిరగాలి. అన్ని పక్కాగా ఇచ్చినా ఎన్ని రోజులకు లోన్ వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇక అలాంటి కష్టాలకు చెక్ పెడుతూ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. కేవలం ఒక మిస్డ్ కాల్‌తో రైతులకు లోన్ అందిస్తున్నట్లు ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా రైతులకు గొప్ప ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించాయి. రైతులకు ఎరువులు, విత్తనాలు, నిత్యావసర సరుకుల కోసం బ్యాంకు తక్కువ వడ్డీలకు రుణాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే పీఎన్‌బీ బ్యాంకు కూడా రైతులను ఆకర్షించేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. తక్కువ వడ్డీకే వ్యవసాయ రుణంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తోంది. ఇప్పుడు చాలా నామమాత్రపు నిబంధనలతో సులభంగా రుణాలు ఇస్తోంది. 


పీఎన్‌బీ బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రుణానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించింది. 'పురోగతి కొత్త వేవ్ వస్తుంది. పీఎన్‌బీ వ్యవసాయ రుణంతో జీవితం మెరుగుపడుతుంది. వ్యవసాయ రుణం కోసం ఎలా దరఖాస్తు చేయాలి..? పూర్తి సమాచారం ఏంటో తెలుసుకోండి..' అని రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు యూట్యూబ్ ఛానెల్ లింక్‌ను కూడా ఇచ్చింది.


 



ఈ రుణం ఎవరికి లభిస్తుంది..?


మీరు కూడా పంజాబ్ నేషనల్ బ్యాక్ ప్రత్యేక ఆఫర్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే.. సులభంగా పొందవచ్చు. దీని కోసం మీరు పీఎన్‌బీ అగ్రికల్చర్ లోన్ కింద దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే పద్ధతులను బ్యాంక్ చాలా సులభతరం చేసింది. ఈ మార్గాలలో దేనిలోనైనా మీరు లోన్ తీసుకోవచ్చు.


రుణం ఇలా తీసుకోవచ్చు..


- మీకు రుణం కావాలంటే 56070కి 'LOAN' అని SMS చేయండి
- ఇది కాకుండా 18001805555కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- మీరు కాల్ సెంటర్‌ను 18001802222లో సంప్రదించడం ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఇది కాకుండా నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ netpnb.com ఆప్షన్ కూడా ఉంది.
- మీరు పీఎన్‌బీ వన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


Also Read: IndiGo winter Sale 2023: ₹2వేలకే విమాన టికెట్‌.. ఇండిగో స్పెషల్ ఆఫర్ చూశారా!


Also Read: Chinmayi : నయనతార మీద అసభ్య కామెంట్లు.. ఆడపిల్లలు పుడితే వారి పరిస్థితి ఏంటి?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.