PV Narasimha Rao: తెలుగు బిడ్డకు భారత రత్న.. పీవీ నరసింహరావుకు దేశ అత్యున్నత పురస్కారం ప్రకటన
Bharat Ratna Award List: మాజీ ప్రధానులు పీవీ నరసింహరావు, చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్లో వెల్లడించారు.
Bharat Ratna Award: భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. అలాగే మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు సైతం భారత రత్న ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూరు కూడా కేంద్రం భారత అత్యున్నత పురస్కారం ప్రకటించింది. భారతదేశాన్ని ఆర్థికాభివృద్ధిలో నూతన శకంలోకి తీసుకువెళ్లిన పీవీ నరసింహారావు దూరదృష్టి గల నాయకత్వాన్ని గుర్తించి.. కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. రైతుల సంక్షేమం కోసం దేశ ప్రధాని చరణ్ సింగ్ చేసిన అచంచలమైన అంకితభావానికి భారతరత్నతో సత్కరించనుంది. వ్యవసాయం, రైతుల సంక్షేమం, దేశ నిర్మాణం, ఆర్థిక సంస్కరణలకు చేసిన ఎంఎస్ స్వామినాథన్ అసమానమైన సేవలను గుర్తిస్తూ ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నారు.
Also Read: Oppo A59: ఫ్లిప్‌కార్ట్‌లో ఒక్కసారిగా తగ్గిన Oppo A59 మొబైల్ ధర..ఎగబడి కొంటున్న జనాలు!
పీవీ నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఆయన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్ 28న జన్మించారు. ఓయూ, బాంబే, నాగ్‌పుర్ యూనివర్సిటీల్లో చదువుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో పాల్గొన్న పీవీ.. ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా పనిచేశారు. 1971 నుంచి 1973 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలోనూ వివిధ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 1991లోనే రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుందామని అనుకున్న సమయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో విరమించుకున్నారు.
1991 నుంచి 1996 దేశ ప్రధానిగా సేవలు అందించారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి దక్షిణ, ఏకైక తెలుగు వ్యక్తిగా ఘనత సొంతం చేసుకున్నారు. 1991లో నంద్యాల పార్లమెంట్ నుంచి ఎంపీగ పోటీ చేసి.. ఏకంగా 5 లక్షల భారీ మెజార్టీతో గెలుపొంది గిన్నిస్ రికార్డు సృష్టించారు. ప్రధానిగా బాధ్యలు చేపట్టిన తరువాత అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారు. ఆయన 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడడంతోపాటు తెలుగు, హిందీలో కవితలు రాసేవారు.
1925 ఆగస్టు 7వ తేదీన మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు ఎంఎస్ స్వామినాథన్. మెట్రిక్యులేషన్ కంప్లీట్ చేసిన తరువాత మెడికల్ స్కూల్‌లో చేరారు. 1943లో బెంగాల్ కరువును ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. దేశాన్ని ఆకలి నుంచి రక్షించాలని ధ్యేయంగా పెట్టుకున్నారు. తన మనసు మార్చుకుని.. వైద్య రంగం నుంచి వ్యవసాయ పరిశోధలు మొదలుపెట్టారు. మన దేశంలో హరిత విప్లవానికి పునాది వేశారు.
1903 డిసెంబర్ 23న ఉత్తరప్రదేశ్‌లోని సామాన్య రైతు కుటుంబంలో మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్ జన్మించారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న ఆయన.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చురుగ్గా పనిచేశారు. 1967-68, 1970 మధ్య కాలంలో రెండుసార్లు యూపీ సీఎంగా పనిచేశారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1979 జులై 28 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు కేవలం 23 రోజులు దేశ ప్రధానిగా పనిచేశారు. కొంతకాలం ఆపద్ధర్మ ప్రధానిగానూ ఉన్నారు. గ్రామాల ఆర్థిక స్థితిగతులకు ఇబ్బందులకు గురి చేసే, అన్నదాతలను దోపిడీ చేసే చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter