Nirmala Sitharaman: గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్..ట్విట్టర్ లో వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి
దేశంలో డిజిటల్ చెల్లింపుల భారీగా పెరిగాయనడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్ట్ చేసిన ఓ వీడియో అద్దం పడుతోంది. ఇంటింటికీ తిరిగి గంగిరెద్దులాడించే వారు కూడా డిజిటల్ రూపంలో భిక్షాటన చేస్తున్నట్లు అందులో ఉంది.
Nirmala Sitharaman: భారత్‌లో డిజిటల్ పేమెంట్ల(Digital payment Revolution)వినియోగం భారీగా పెరిగింది. అరచేతిలో స్మార్ట్‌ఫోన్(Smart phone) ఉంటే చాలు వివిధ రకాల బిల్లుల డబ్బులు సులభంగా చెల్లించవచ్చు. సూపర్ మార్కెట్ నుంచి కిల్లీకొట్టు వరకు.. పానీపూరీ బండి నుంచి షాపింగ్ మాల్స్ వరకు ఈ మధ్య ఎక్కడ చూసినా గూగుల్ పే, ఫోన్ పే క్యూఆర్ కోడ్‌లే దర్శనమిస్తున్నాయి. నగరాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ చెల్లింపులు అధికమయ్యాయి.
దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తాజాగా ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఇంటింటికీ తిరిగి గంగిరెద్దులాడించే వారు కూడా డిజిటల్ రూపం(digital payments)లో భిక్షాటన చేస్తున్న వీడియోను ఆమె తన ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ వీడియో దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎలా మార్పు తీసుకొచ్చిందనే దానికి అద్దం పడుతోంది.
Also Read: Zika Virus in Kanpur: కాన్పూర్‌లో 'జికా' కల్లోలం...ఒక్కరోజే 30 కేసులు నిర్ధారణ..
30 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో గంగిరెద్దు తలపై క్యూఆర్ కోడ్ ట్యాగ్(QR Code tag)ఉంటుంది. ఓ వ్యక్తి దాన్ని స్కాన్ చేసి గంగిరెద్దులాడించే వ్యక్తికి డబ్బులు పంపుతాడు. ఈ వీడియోను నిర్మలా సీతారామన్ పోస్ట్ చేస్తూ.. ‘‘గంగిరెద్దులాట(Gangireddulata) రికార్డెడ్ వీడియో ఇది. ఇందులో వారు క్యూఆర్ కోడ్‌ల ద్వారా భిక్ష తీసుకుంటున్నారు. భారత డిజిటల్ చెల్లింపుల విప్లవం జానపద కళాకారుల వరకూ చేరింది’’ అని రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గంగిరెద్దుల వాళ్లు తమ పాత ఎద్దులను అలంకరించి పండగల సమయాల్లో ఇంటింటికీ తిరిగి నాదస్వరం ఊదుతూ భిక్షాటన చేస్తుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి