రాఫెల్ కథలో... బీజేపీకి సత్యపరీక్ష..!
ఫ్రాన్స్ దేశం నుండి గతంలో 126 రాఫెల్ జెట్ విమానాలను పొందేందుకు యూపీఏ ప్రభుత్వం తన హయాంలో పూర్తిస్థాయి సాంకేతికతతో సహా 90 వేల కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది.
ఫ్రాన్స్ దేశం నుండి గతంలో 126 రాఫెల్ జెట్ విమానాలను పొందేందుకు యూపీఏ ప్రభుత్వం తన హయాంలో పూర్తిస్థాయి సాంకేతికతతో సహా 90 వేల కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే మోదీ మంత్రివర్గం బాధ్యతలు స్వీకరించాక.. రక్షణ శాఖ ఎటువంటి సాంకేతికత లేని 36 రాఫెల్ విమానాలను 60 వేల కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని పలు వార్తలు రావడంతో సర్వత్రా ఆశ్చర్యం నెలకొంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్లమెంటులో మోదీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఒక్కో యుద్ధ విమానాన్ని కొనడానికి ఎంత మొత్తం వెచ్చించారని కాంగ్రెస్ సభ్యుడు అడగగా.. సమాధానం ఇవ్వడానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ నిరాకరించారు. భారత్–ఫ్రాన్స్ ఒప్పందం ప్రకారం ఈ రహస్య సమాచారాన్ని తాము బహిర్గతం చేయరాదని ఆమె తెలిపారు.
ఇదే సమయంలో రాఫెల్ ఒప్పందంలో భారీ స్కాం జరిగే అవకాశం ఉందని పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీ పై మండిపడ్డారు. నిజానిజాలు తేలాల్సిందేనని తెలిపారు. 7 ఫిబ్రవరి 2018న జరిగిన మోదీ ప్రసంగ కార్యక్రమంలో కూడా రాఫెల్ ఒప్పందంపై ప్రధాని ఏమీ తెలియజేయలేదని రాహుల్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 2016లో పాత ఒప్పందాలను పక్కన పెట్టి భారత ప్రభుత్వం, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆధ్వర్యంలో 58 వేల కోట్లతో 6 రాఫెల్ ఫైటర్ జెట్స్ కోసం ఫ్రాన్స్‌తో చారిత్రక ఒప్పందం చేసుకుంది.