Rahul Gandhi: రాహుల్ గాంధీకి బంపరాఫర్.. ? తొలిసారి ఆ పాత్రలో కనిపించనున్న కాంగ్రెస్ అగ్రనేత..
Rahul Gandhi: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండి కూటమి మంచి ఫలితాలనే రాబట్టింది. అంతేకాదు గతంలో కంటే ఘనమైన సీట్లను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ లోక్ సభ కీలక భూమిక పోషించబోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న మాట.
Rahul Gandhi: రాహుల్ గాంధీ .. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు. గత రెండు పర్యాయాలు లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. కానీ ఈ సారి మాత్రం లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లతో ప్రతిపక్ష స్థానంలో ఉంది. దీంతో ఈ లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత బాధ్యతలు స్వీకరించబోతున్నారా అంటే ఔననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. ఈయన ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. కేరళలోని వయనాడ్ తో పాటు రాయబరేలి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అంతేకాదు రెండు చోట్లా 3 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. త్వరలో రాహుల్ గాంధీ వయనాడ్ సీటును ఒదలుకొని రాయబరేలి నుంచే కంటిన్యూ కావాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు సమాచారం. ఒక వేళ రాయబరేలికి రాజీనామా చేస్తే ఆ సీటును తన చెల్లెలు ప్రియాంక వాద్రాకు ఇవాల్సి ఉంటుంది. పార్టీలో మరో బలమైన కీలక శక్తిగా మారే అవకాశం ఉన్నందున ఆమెకు చెక్ పెట్టేందుకు అందుకే కీలకమైన ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలిని ఉంచుకొని వయనాడ్ ను ఒదులుకోనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోని అగ్ర నేతలు అందరు ఏకగ్రీవంగా ఆయన్నే ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించమని చెబుతున్నారు. ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేత అయినా.. చిదంబరంతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ఆయన్నే లోక్ సభలో ప్రతిపక్ష నేత బాధ్యతలు స్వీకరించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో మల్లిఖార్జున ఖర్గే పేరుకు మాత్రమే అధ్యక్షుడుగా ఉన్నారని బీజేపీ సహా పలు పార్టీలు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ అనుకుంటే ఆయన్ని ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించడం లాంఛమనే అని చెప్పాలి.
Also Read: KT Rama Rao: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశే.. కానీ ఫినీక్స్ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter