Rahul Gandhi: 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ ముందు అతిపెద్ద సవాల్ ఎదురు కాబోతుంది. రాహుల్ ఈ సారి కేరళలోని వాయనాడ్ తో పాటు.. ఉత్తర ప్రదేశ్ లో గాంధీ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న రాయబరేలి నుంచి బరిలో దిగారు. తాజాగా రాహుల్ గాంధీ రెండో చోట్ల గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ గెలిస్తే..వాయనాడ్  కు రాజీనామా చేస్తారా.. లేకపోతే రాయబరేలి స్థానానికి రిజైన్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఏదైనా ఒక చోట ఓడిపోతే మాత్రం ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ లేదు. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మాత్రం రాహుల్ గాంధీ వాయనాడ్ తో పాటు రాయబరేలి నుంచి ఖచ్చితంగా గెలుస్తాడనేది అందరు చెబుతున్న మాట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహుల్ గాంధీ గత 2019 ఎన్నికల్లో వాయనాడ్ తో పాటు అమేథి నుంచి ఎంపీగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో అమేథి స్థానం నుంచి ఓడిపోతాననే సర్వేల నేపథ్యంలో అమేథితో పాటు వాయనాడ్ నుంచి ఎంపీగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో అమేథి నుంచి రాహుల్ గాంధీ తన ప్రత్యర్ధి బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. కానీ అదే సమయంలో వాయనాడ్ నుంచి రికార్డు మెజారిటీతో పార్లమెంటులో అడుగుపెట్టారు. 2024 ఎన్నికల్లో కూడా ముందుగా రెండో విడతలో జరిగిన కేరళ ఎన్నికల్లో వాయనాడ్ నుంచి బరిలో దిగారు. ఆ తర్వాత చడీ చప్పుడు చేయకుండా.. రాయబరేలి నుంచి ఎంపీగా పోటీ చేసారు. అమేథి నుంచి గెలవనే ఉద్దేశ్యంతో రాహుల్ గాంధీ రాయబరేలి నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ .. రాయబరేలి నుంచి ఎంపీగా గెలబోతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.


కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సారి కూడా రెండు చోట్ల నుంచి ఎంపీగా పోటీ చేయడం విశేషం. రెండో విడత ఎన్నికల్లో భాగంగా కేరళలోని వాయనాడ్ నుంచి రెండోసారి లోక్ సభకు పోటీ చేసారు. అక్కడ గెలుపు పై నమ్మకం లేకనే ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని కీలకమైన రాయబరేలి నుంచి బరిలో దిగినట్టు ఆయన ప్రత్యర్ధి పార్టీ ఈయిన బీజేపీ ఆరోపణలు చేసింది. అవేమి పట్టించకోకుండా రాహుల్ గాంధీ తమ కుటుంబానికి కంచుకోటగా వస్తున్న రాయబరేలి నుంచి ఎంపీగా పోటీ చేసారు. బీజేపీ ముందు నుంచి చెబుతున్నట్టుగా రెండో విడత ఎన్నికలు పూర్తైయిన తర్వాత ముందస్తుగా అక్కడ నుంచి పోటీ చేస్తోన్నట్టు చెప్పకుండా రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసారు. తన నియోజకవర్గం అమేథీ నుంచి కాకుండా రాయబరేలి నుంచి పోటీ చేయడం వెనక ఆయన అక్కడ ఓడిపోతారనే బలమైన నమ్మకంతో ఈ సీటు నుంచి పోటీ చేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. 


ఒక వేళ రాయబరేలి ఉంచుకొని వాయనాడ్ స్థానానికి రాజీనామా చేస్తే అక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేరళకు చెందిన కాంగ్రెస్ నేతలను ఇక్కడ నుంచి బరిలో దింపుతారా.. లేకపోతే.. ప్రియాంక వాద్రాను అక్కడ నుంచి పోటీ చేయిస్తారా అనేది చూడాలి.


కానీ ప్రియాంక వాద్రా మాత్రం ఉత్తరప్రదేశ్ రాజకీయాలపైనే తన దృష్టి కేంద్రీకరించింది. ఒక వేళ రాహుల్ గాంధీ..రాయబరేలికి రాజీనామా చేస్తే.. ప్రియాంక వాద్రా.. రాయబరేలి నుంచి లోక్ సభకు పోటీ చేయవచ్చనే ఊహగానాలు ఊపందుకున్నాయి. ఏది ఏమైనా రాహుల్ గాంధీ.. రెండు చోట్ల గెలిచినా.. ఏ నియోజవర్గాన్ని కంటిన్యూ చేయాలనే దానిపై డైలామాలో పడినట్టు తెలుస్తోంది. ఇక రాయబరేలి నుంచి 2014లో సోనియా గాంధీ దాదాపు మూడు లక్షల మెజారిటీతో విజయం సాధించారు. 2019లో అది సగానికి తగ్గింది. ఈ సారి రాహుల్ గాంధీ ఈ నియోజవర్గంలో గెలిస్తే.. ఎంత మెజారిటీతో గెలుస్తారనేది కూడా హాట్ టాపిక్ మారింది.  ఇక రాహుల్ గాంధీ రెండు చోట్ల గెలిచినా.. దేశంలో రాజకీయంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ను అతి ఈజీగా విడిచిపెట్టే అవకాశాలు లేదు. ఏది ఏమైనా రాయబరేలికి రాహుల్ గాంధీ రాజీనామా చేసే ప్రసక్తి లేదనే ముచ్చట వినిపిస్తోంది.



రాహుల్ గాంధీ తొలిసారి పోటీ చేసిన  రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గంలో ముందు నుంచి వాళ్ల కుటుంబానికి అండగా నిలుస్తూ వస్తోంది. ఈ లోక్ సభ సీటు నుంచి రాహుల్ తాత ఫిరోజ్ గాంధీ, ఆ తర్వాత నానమ్మ ఇందిరా గాంధీ వంటి వాళ్లు పోటీ చేసిన నెగ్గారు. అటులి సోనియా గాంధీ ఎంపీ ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు.  1996, 99 ఎన్నికల్లో మాత్రం రాయబరేలి సీటు బీజేపీ వశం అయింది. 2004 నుంచి 2019 వరకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయబరేలి నుంచి లోక్ సభ సభ్యురాలిగా  నాలుగు పర్యాయాలు విజయం సాధించారు. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా.. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపీగా నామినేట్ అయ్యారు. 2024లో రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడి కానున్నాయి. అందులో రాహుల్ గాంధీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారనేది చూడాలి.


Also read: AP Rains Alert: విస్తరిస్తున్న నైరుతి, ఏపీలో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook