గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించిన సందర్భంగా.. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం 'ప్రజల తీర్పు' స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"కాంగ్రెస్ పార్టీ ప్రజల తీర్పును స్వాగతిస్తుంది. రెండు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వాలకు అభినందనలు. నాపై ప్రేమాభిమానాలు చూపించిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను"  అని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో రాశారు.


"నా కాంగ్రెస్ సోదరులు, సోదరీమణులు నన్ను ఎంతో గర్వపడేలా చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ఏమాత్రం తగ్గలేదనే విషయాన్ని జనం నిరూపించారు" అని గాంధీ పేర్కొన్నారు.


కడపటి వార్తలందేసరికి గుజరాత్ (182 స్థానాలు) లో బీజేపీ 98 స్థానాలు, కాంగ్రెస్ 79 స్థానాల్లో,ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్, బీజేపీ చెరో స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 



 


హిమాచల్ ప్రదేశ్(68 స్థానాలు) లో బీజేపీ 41 స్థానాలు, కాంగ్రెస్ 20, ఇతరులు 2 స్థానాలలో గెలిచారు. బీజేపీ 3, కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.