కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పెట్టుబడి, బ్యాంకు రుణాలు, ఉద్యోగ కల్పన, వ్యవసాయ వృద్ధి క్షీణతపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై విమర్శలు సంధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనవరి 6న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రం అవలంభిస్తున్నఆర్థిక సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోందన్నారు. ఇప్పటివరకు 'గబ్బర్ సింగ్ టాక్స్', 'ఫేక్ ఇన్ ఇండియా' అంటూ జీఎస్టీ, నోట్ల రద్దుకు కొత్త నిర్వచనాలు చెప్పిన రాహుల్.. మరోసారి తనదైన శైలిలో జీడీపీకి కొత్త అర్థం చెప్పారు.  జీడీపీని ' స్థూల విభజన రాజకీయాలు (గ్రాస్ డివైసివ్ పాలిటిక్స్)'  గా అభివర్ణించారు.



దీంతో పెట్టుబడులు 13 ఏళ్ల కనిష్ఠానికి, బ్యాంకు క్రెడిట్ వృద్ధి 63 ఏళ్ల కనిష్టానికి, ఉద్యోగ కల్పన 8 ఏళ్ల కనిష్టానికి, వ్యవసాయ జీవిఎ వృద్ధి 1.7%కి తగ్గిందని, ద్రవ్యలోటు 8ఏళ్ల గరిష్టానికి చేరుకుందని, పెండింగ్ ప్రాజెక్టులు సైతం పెరిగాయని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో తెలిపారు. 2017-18 ఆర్థిక వృద్ధిరేటు 2016-17లో సాధించిన 7.1 శాతం కన్నా తక్కువగా ఉంటుందని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్(సీఎస్ఓ) నివేదించిన సంగతిని గుర్తుచేశారు.