Rahul Gandhi: ఈడీ కేసులో రాహుల్ అరెస్ట్ అవుతారా? రెండవ రోజు ప్రశ్నల వర్షం..
Rahul ED Office: నేషనల్ హెరాల్ట్ కేసులో రెండవ రోజు ఈడీ విచారణకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో వెలుగుచూసిన మనీ లాండరింగ్ కు సంబంధించి ముగ్గుడు ఈడీ ఉన్నతాధికారులు రాహుల్ ను ప్రశ్నిస్తున్నారు.
Rahul ED Office: నేషనల్ హెరాల్ట్ కేసులో రెండవ రోజు ఈడీ విచారణకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో వెలుగుచూసిన మనీ లాండరింగ్ కు సంబంధించి ముగ్గుడు ఈడీ ఉన్నతాధికారులు రాహుల్ ను ప్రశ్నిస్తున్నారు. నిన్న కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. రెండు సెషన్లలో మొత్తం 10 గంటల పాటు ఈడీ అధికారులు రాహుల్ ను ప్రశ్నించారు. మూతపడిన నేషనల్ హెరాల్డ్ ను మళ్లీ ఎందుకు తెరిచే ప్రయత్నం చేశారు.. నిధులను ఎక్కడి నుంచి సమీకరించారు వంటి అంశాలపై రాహుల్ గాంధీని ప్రశ్నించారని తెలుస్తోంది. రాహుల్ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. తొలి రోజు ఈడీ ప్రశ్నలకు రాహుల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
తొలి రోజు రాహుల్ వెంట ఈడీ కార్యాలయానికి వచ్చిన ప్రియాంక గాంధీ.. రెండవ రోజు కూడా అన్నవెంటే వచ్చారు. రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలవడంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. నిన్న దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. రాహుల్ ను రెండవరోజు విచారణకు పిలవడంతో ఇవాళ మరింత ఉధృతంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. ఏఐసీసీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు భారీగా వచ్చారు. అయితే పోలీసులు ఎవరిని లోపలికి అనుమతించలేదు. వచ్చినవాళ్లను వచ్చినట్లు పోలీసులు అదుపులోనికి తీసుకుని బస్సుల్లో తరలించారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండవరోజు రాహుల్ ను ఈడీ ప్రశ్నిస్తుండటంతో.. నేషనల్ హెరాల్డ్ కేసులో అరెస్ట్ చేస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తోంది. భారత భూభాగాన్ని చైనా చేజిక్కించుకోవడం, ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెంపు, నిరుద్యోగం, మతపరమైన ప్రతీకారం వంటి అంశాలపై మోడీ ప్రభుత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నిస్తూ వచ్చిన రాహుల్ గాంధీపై ఈడీ విచారణ ఆయన గొంతును మూయించే ప్రయత్నమే అన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా. తాము గాంధీ వారసులమని, మరోసారి నడుస్తామని, తమ సత్యాగ్రహం ఆగదని చెప్పారు.
Read also: CM KCR: కేసీఆర్ షాకింగ్ న్యూస్... మమత మీటింగ్ కు డుమ్మా!
Read also: Siddhanth Kapoor: డ్రగ్స్ కేసులో సిద్ధాంత్ కపూర్ విడుదల.. శ్రద్ధా కపూర్ ను ప్రశ్నిస్తారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి